Cigarette Dispute : సిగరెట్ ఇవ్వలేదని రెచ్చిపోయిన గూండా.. షాపులో 15 రౌండ్లు కాల్పులు!

Cigarette Dispute : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నేరగాళ్లు పోలీసులకు ఏ మాత్రం భయపడకుండా వరుసగా కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా జరిగిన ఒక షాకింగ్ ఘటనలో, కేవలం పది రూపాయల సిగరెట్ ఇవ్వలేదని ఒక కిరాణా వ్యాపారిపై ఏకంగా 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఇంతకుముందు కూడా గ్వాలియర్‌లో 700 రూపాయల విషయంలో ఒక ఇటుక బట్టీ వ్యాపారిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఈ వరుస ఘటనలు గ్వాలియర్‌లోని శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఈసారి జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే..వాలియర్లోని మహారాజ్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిరాణా దుకాణానికి కొంతమంది దుండగులు అప్పుగా సిగరెట్ అడగడానికి వచ్చారు. దుకాణదారుడు సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో వారిలో ఒకడైన చోటు అనే వ్యక్తి ఆగ్రహానికి గురయ్యాడు. ఆవేశంతో ఊగిపోయిన చోటు, అతని అనుచరులు వెంటనే కిరాణా వ్యాపారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వారు ఏకంగా 15 రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కానీ ఈ కాల్పుల సంఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానక వాతావరణంలోకి మారిపోయింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు.
Read Also:Summer: వేసవి సెలవుల్లో పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండాలంటే.. వీటిని నేర్పించండి
ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా, ఈ దాడికి సంబంధించిన ఒక భయానక వీడియో కూడా బయటకు వచ్చింది. కిరాణా దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరా ఈ మొత్తం ఘటనను రికార్డ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో దుండగులు కాల్పులు జరుపుతుండగా, దుకాణంలో భయంతో పరుగులు తీస్తున్న ప్రజల దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దుకాణదారుడు సుర్జీత్ మవాయి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. కొంతమంది వ్యక్తులు వచ్చి సిగరెట్ అడిగారని, డబ్బులు అడిగినప్పుడు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. సిగరెట్ ఇవ్వనందుకు వారు తనపై 15 రౌండ్లు కాల్పులు జరిపారని ఆయన భయంతో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో ఆధారంగా దుండగులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గ్వాలియర్‌లో పెరుగుతున్న ఈ తరహా నేరాలను అదుపు చేయడానికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Read Also:Fruit Peel Uses : తొక్కే కదా అని పారేస్తున్నారా.. పండ్ల తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు