Akhil Marriage: అఖిల్ పెళ్లి.. బరాత్‌లో రచ్చ రంబోలా చేసిన తండ్రీ కొడుకులు.. వీడియో వైరల్

Akhil Marriage: అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ అక్కినేని, జైనాబ్‌తో వివాహం జరగుతుందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ అఖిల్ పెళ్లిపై నాగార్జున ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ నాగార్జున రాజకీయ, సినీ ప్రముఖులకు వివాహానికి ఆహ్వానించారు. దీంతో వీరి పెళ్లి జరగున్నట్లు క్లారిటీ వచ్చింది. అయితే వార్తలకు తగ్గట్లుగానే అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనాబ్ పెళ్లి శుక్రవారం ఉదయం జరిగింది. జూబ్లిహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. అఖిల్ వివాహానికి టాలీవుడ్ ప్రముఖలు హాజరయ్యారు. చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, శర్వానంద్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
My Demigod Marriage Vibes 🔥
King Akhil Chay 🤯
Energy Levels 💥#AkhilWedding #AkhilAkkineni pic.twitter.com/EEIhmEyWy5— King Srinu (@KingSrinu0120) June 6, 2025
వివాహం తెల్లవారు జామున జరిగింది. వివాహం తర్వాత బరాత్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా నాగార్జున, నాగ చైతన్య చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుడు అఖిల్ కూడా బరాత్ లో డ్యాన్స్ వేశాడు. డోలు చప్పుళ్లకు, అదిరిపోయే బీట్ లకు నాగార్జున ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించారు. ఆయన ముఖంలో కొడుకు పెళ్లి ఆనందం స్పష్టంగా కనిపించింది. పక్కనే నాగ చైతన్య కూడా తనదైన శైలిలో డ్యాన్స్‌లు చేశారు. వీరే కాకుండా, అఖిల్, సుమంత్, సుశాంత్ కూడా బరాత్ లో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అఖిల్, జైనాబ్ ఒకే రంగు, తెల్లని పట్టు దుస్తులలో సూపర్‌గా ఉన్నారు. అఖిల్ సాంప్రదాయ పంచెకట్టులో కనిపించగా, జైనాబ్ తెల్లని పట్టు చీర, డైమండ్ ఆభరణాలతో ఆకట్టుకున్నారు. ఈ జంట సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా కనిపించింది. దీంతో అందరూ వీరిని ప్రశంసిస్తున్నారు. జంట చూడముచ్చటగా ఉన్నారని అంటున్నారు. జైనాబ్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవబ్జీ కుమార్తె. జైనాబ్ ఒక కళాకారిణి, పెర్ఫ్యూమర్, వ్యాపారవేత్త కూడా. వీరిద్దరూ గత నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితల వివాహం కూడా జరిగిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు