Allu Arjun Atlee Movie Updates: డ్యూయల్ రోల్‌లో.. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్‌లో బన్ని
Allu Arjun Atlee Movie Updates: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మొత్తం హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది. ఈ మూవీలో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలిసి లోలా VFX కంపెనీకి వెళ్లారు.

Allu Arjun Atlee Movie Updates: పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ అట్లీతో మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో మూవీ తప్పకుండా హిట్ అవుతుందని, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో దుమ్ములేపుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ కోసం అల్లు అర్జున్, అట్లీ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి ఐకాన్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పునర్జన్మ బ్యాక్ డ్రాప్‌లో వస్తు్న్న ఈ మూవీకి ఐకాన్ అయితే సెట్ అవుతుందని మూవీ టీం భావిస్తు్న్నట్లు తెలుస్తోంది. సినిమా పేరు ఇదేనని జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో పాటు సూపర్ హీరో అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే మూవీలో అల్లు అర్జున్ డ్యూయల్ రూల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అల్లు అర్జున్ నెగిటివ్ రూల్‌లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం నార్త్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పాత్రను ప్లాన్ చేశారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Dhanush : ‘కుబేర’ అడ్డుకోవాలని చూస్తే సహించను.. ఎవరికీ ధనుష్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మొత్తం హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది. ఈ మూవీలో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కలిసి లోలా VFX కంపెనీకి వెళ్లారు. ఈ వీఎఫ్‌ఎక్స్ అనేది హాలీవుడ్‌లో చాలా ఫేమస్. వీరు అక్కడికి వెళ్తే.. అక్కడ సినిమాలకు సంబంధించిన VFX పరికరాలను మొత్తం వీళ్లిద్దరికీ చూపించారు. అలాగే వాటి గురించి వివరించారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ హాలీవుడ్‌పై కన్ను వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఈసారి హాలీవుడ్ రేంజ్‌లో ఫేమస్ కావాలని చూస్తున్నట్లు టాక్. అందుకే ప్రముఖమైన హాలీవుడ్ లోలా వీఎఫ్‌ఎక్స్‌ను సంప్రదించాడు. ఈ సినిమా హాలీవుడ్‌లో అవతార్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి సినిమాలకు హిట్ ఇవ్వగా.. తెలుగులో కల్కి, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం, ఇండియన్ 3 వంటి చిత్రాలకు ఇచ్చారు.
Also Read: Thug Life : కమల్ హాసన్ తర్వాత కన్నడిగుల ఆగ్రహాన్ని రెచ్చగొట్టిన ఆర్జీవీ.. ఇంతకీ ఏమన్నారంటే ?
ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఫ్లాప్ లేదు. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా వరుస హిట్‌లు సాధించారు. అట్లీ సినిమాల్లో జవాన్ రూ.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలతో అలరించిన అట్లీ ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో సినిమా తీయబోతున్నాడు. అందుకే ఈ వీఎఫ్‌ఎక్స్ సంస్థకు వెళ్లినట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా ఏ స్టోరీ ఎంటనే విషయం కూడా తెలియదు. ఇంటర్నేషనల్ వైజ్‌గా ఉండటంతో ప్రియాంక చోప్రాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.
-
Anushka Shetty : అనుష్క ఒకే ఒక్క ఫోటో చూస్తూ 40 యాక్సిడెంట్లు.. ఇంతకీ ఏంటా సినిమా ?
-
IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!
-
Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?
-
How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
-
YouTuber Sunny Yadav arrested: యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్.. బెట్టింగ్ యాప్స్ కారణమా?
-
Gaddar Awards : అల్లు అర్జున్ కే ఉత్తమ నటుడు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం.. గద్దర్ అవార్డ్స్ విజేతలు వీరే