Hero nani:నేచురల్ స్టార్ నాని రియల్ నేమ్ ఇదే.. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా

Hero Nani:
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ నటనతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కొత్త కొత్త కథలతో సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. నేచురల్ స్టార్ నాని తన నటనతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఎలాంటి నటన అయినా కూడా సహజత్వంతో కనిపిస్తాడు. చాలా నేచురల్‌గా తన నటన ఉండటంతో నేచురల్ స్టార్ అని బిరుదు కూడా సంపాదించుకున్నాడు. సహాయ దర్శకుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ వరుస హిట్‌లు సాధిస్తున్నాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ వరుస సినిమాల ఆఫర్లు సంపాదించుకున్నాడు. అయితే నాని అనే పేరు చాలా మంది నిక్ నేమ్‌గా వాడుతుంటారు. ఒరిజినల్‌గా ఈ నేమ్ ఉండటం చాలా తక్కువ. అయితే మనలో చాలా మందికి నాని ఒరిజినల్ పేరు తెలియదు. ఇంతకీ హీరో నాని ఒరిజినల్ పేరు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలో నాని కూడా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. వైవిధ్యమైన పాత్రల నటిస్తూ.. వరుస హిట్‌లు నాని సాధిస్తున్నాడు. అయితే నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు. చిన్నప్పటి నుంచి తనని ఇంట్లో అందరూ నాని అనే పిలిచేవారట. దీంతో నాని సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత పేరు మార్చుకున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లాకి చెందిన నాని తెలుగు ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశాడు. నాని ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఈగ,ఎవడే సుబ్రమణ్యం,భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ,నేను లోకల్,నిన్ను కోరి,ఎం.సి.ఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి),జెర్సీ,శ్యామ్ సింగ రాయ్,అంటే సుందరానికి,దసరా,హాయ్ నాన్న వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. నాని కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. నాని తెలుగు బిగ్ బాస్ సీజన్ 2కి కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో హిట్ కొట్టిన నాని మళ్లీ హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
హిట్ యూనివర్స్‌లో భాగంగా హిట్ 3 ది థర్డ్ కేస్ అని వస్తోంది. శైలేశ్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాని ఫవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అర్జున్ సర్కార్‌గా వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపిస్తోంది. హిట్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు మే 1న రాబోతుంది. పవర్ ఫుల్‌గా చాలా కిరాతకంగా ఈ సినిమా రాబోతున్నట్లు టీజర్‌లో తెలుస్తుంది. గతంలో హిట్ 1, 2లో విశ్వక్ సేన్, అడవి శేషు హీరోలుగా కనిపించారు. ఇక మూడో పార్ట్‌లో నాని హీరోగా మెప్పించనున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court: అంచనాలు లేకుండా వచ్చిన కోర్టు మూవీ.. మొదటి రోజే కలెక్షన్లు దుల్లగొట్టిందిగా!
-
Yevade Subramanyam: పదేళ్ల తర్వాత నాని మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
-
Hero Nani: ది ప్యారడైజ్.. ఈ పాత్రకు నాని ఒకే చెప్పడం వెనుక ఇంత కారణం ఉందా?
-
HIT 3 Teaser: వచ్చేసిన నాని హిట్ 3 టీజర్.. అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ.. వయెలెంట్‌గా మాములుగా లేదుగా..లాఠీకి దొరికినోడి పరిస్థితి…
-
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున అసలు పేరు ఇదే.. పేరు వెనుక ఇంత స్టోరీ ఉందా?