HIT 3 Teaser: వచ్చేసిన నాని హిట్ 3 టీజర్.. అర్జున్ సర్కార్ ఆన్ డ్యూటీ.. వయెలెంట్‌గా మాములుగా లేదుగా..లాఠీకి దొరికినోడి పరిస్థితి…

HIT 3 Teaser:
నానీ హీరోగా నటిస్తున్న హిట్ 3 టీజర్ వచ్చేసింది. హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా హిట్ 3 మూవీ టీజర్‌ను టీం విడుదల చేశారు. యాక్షన్ సీన్స్‌తో చాలా వయెలెంట్‌గా ఉంది. టీజర్ మొత్తం కూడా చాలా వయెలెంట్‌గా.. పీక్స్‌లో ఉంది. నాని జీవించేశాడు. మీకు ప్రాబ్లెమ్ లేదంటే ఓ పేరు చెబుతా.. అనే వాయిస్‌తో టీజర్ ప్రారంభమైంది. వెంటనే అర్జున్ సర్కార్ వాయిస్ వినిపించింది. ఈ కేసును తనకి ఇవ్వాడానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు కానీ.. వీడి లాఠీకి దొరికిన వాడి పరిస్థితి ఆలోచిస్తేనే చాలా భయంగా ఉందని రావు రమేష్ అంటాడు. అప్పుడే నాని ఎంట్రీ ఉంటుంది. స్టైలిష్‌గా లాఠీ పట్టుకుని నాని ఎంట్రీ ఇస్తాడు.
టీజర్ అయితే ఒక రేంజ్‌లో ఉంది. చాలా వయెలెంట్‌గా కూడా ఉంది. లాఠీతో ఓ క్రిమినల్‌ని చాలా క్రూరంగా కొడతాడు. ఆ తర్వాత ఓ అమ్మాయి వచ్చి అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్‌వేనా? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు ఈ డౌట్ వచ్చిందని అంటుంది. అందరూ ఇలా అనుకునే మోసపోయారని, జనం ఇన్నేళ్ల నుంచి ఇలానే మోసపోతున్నారని అంటారు. మీకు ఒరిజినల్ చూపిస్తా అంటూ.. అనే డైలాగ్ టీజర్ అంచనాలను పెంచేసింది. టీజర్ మొత్తం రక్తపాతమే ఉంది. మిగతా సినిమాలతో పోలిస్తే నాని ఈ సినిమాలో చాలా వయెలెంట్‌గా కనిపించాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు రక్తపాతమే ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో నానిది డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఫైనల్లీ టీజర్ అదిరిపోయిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా హిట్ 3 మూవీలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హిట్ ఫ్రాంచైజీలో వస్తోంది. ఇది వరకు హిట్ రెండు పార్ట్‌లు వచ్చాయి. ఈ సినిమాను నాని నిర్మిస్తున్నాడు. వరల్డ్ వైడ్‌గా హిట్ 3 మూవీ మే 1వ తేదీన రిలీజ్ కానుంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే హిట్ మూవీలో హీరోగా విశ్వక్ సేన్ నటించగా.. హిట్ 2 లో అడవి శేష్ కనిపించాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి. దీంతో హిట్ 3ని నానితో తీస్తున్నారు. ఇదిలా ఉండగా నాని ఈ సినిమా తర్వాత సుజీత్‌తో చేస్తున్నాడు. ఒక పక్క హీరోగా చేస్తూనే.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. నాని కోర్టు అనే సినిమాను నిర్మించాడు. ఇది మార్చి 14న రిలీజ్ కాబోతుంది.
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Court: అంచనాలు లేకుండా వచ్చిన కోర్టు మూవీ.. మొదటి రోజే కలెక్షన్లు దుల్లగొట్టిందిగా!
-
Yevade Subramanyam: పదేళ్ల తర్వాత నాని మూవీ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
-
Hero Nani: ది ప్యారడైజ్.. ఈ పాత్రకు నాని ఒకే చెప్పడం వెనుక ఇంత కారణం ఉందా?
-
Hero nani:నేచురల్ స్టార్ నాని రియల్ నేమ్ ఇదే.. మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా