Mahesh-Namratha: విడిపోయి మళ్లీ కలిసిన మహేష్, నమ్రత.. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే?

Mahesh-Namratha:
సినీ ఇండస్ట్రీ అంటే ప్రేమ, విడాకులు, బ్రేకప్ ఇలా చాలానే ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటారు. చేసుకున్నా కూడా ఆ తర్వాత కలిసి ఉంటారంటే కష్టమే. ప్రేమించి ఘనంగా పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లే మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. గతంలో ఈ విడాకుల కేసులు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. మన కళ్ల ముందు విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అయితే రిలేషన్ షిప్, వివాహ బంధంలో అయినా గొడవలు కామన్. వీటిని తట్టుకుని నిలబడే వారి కంటే విడిపోయే వారే ప్రస్తుతం ఎక్కువ మంది ఉన్నారు. విడిపోయిన తర్వాత కలవడం కష్టమే. సినీ ఇండస్ట్రీలో ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు జంట కూడా ఉంది. వీరిద్దరికి కూడా గతంలో బ్రేకప్ అయ్యిందట. కానీ మళ్లీ కలిశారని నమ్రత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకి కాస్త దూరం పాటించి కలిసిపోయిన జంటల్లో వీరు కూడా ఒకరు. అసలు వీరిద్దరూ ఎప్పుడు విడిపోయారు? ఏంటనే స్టోరీ చూద్దాం.
ఎంతో సంతోషంగా వారి జీవితం సాగుతున్న సమయంలో మహేశ్, నమ్రత మధ్య కాస్త గ్యాప్ వచ్చిందట. ఆ సమయంలో మహేష్ కూడా కెరీర్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నమత్ర తల్లిదండ్రులు కూడా అదే సమయంలో చనిపోయారు. దీంతో వారి మధ్య కాస్త అభిప్రాయ బేధాలు వచ్చాయట. ఈ సమయంలో నమ్రత మహేష్‌ను వదిలి కొడుకుని తీసుకుని ముంబాయికి వెళ్లిపోయిందట. ఆ దూరమే మళ్లీ వాళ్ల ప్రేమను తెలిసేలా చేసిందట. అలా విడిపోయిన తర్వాతే వారి బంధం ఎంతో బలమైందని తెలిపింది. ఇలా కొన్ని రోజులు బ్రేకప్ తర్వాత మళ్లీ కలుసుకున్నట్లు నమత్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. విడిపోయిన తర్వాత మళ్లీ సితారకు జన్మనిచ్చినట్లు నమ్రత తెలిపారు. అలాగే మహేష్ కోసం తన కెరీర్‌ను పక్కన పెట్టినట్లు కూడా తెలిపారు. తనకోసమే సినిమాల్లో నటించలేదని నమ్రత తెలిపారు.
పెళ్లి అయిన తర్వాత హీరోయిన్‌గా కొనసాగడం మహేష్‌కు ఇష్టం లేదు. ఈ విషయాన్ని రిలేషన్‌లో ఉన్నప్పుడే చెప్పినట్లు తెలిపారు. హీరోయిన్ అనే కాదు.. ఏ ఉద్యోగం చేసినా కూడా పెళ్లి అయిన తర్వాత వద్దని అడిగేవాడని తెలిపింది. అయితే తనకు స్టార్ హీరోయిన్ కావాలనే ఆశ ఎప్పుడూ లేదని, అందుకే సినిమాలు ఆపేసినప్పుడు పెద్దగా బాధ అనిపించలేదని నమ్రత తెలిపారు. అయితే మహేష్ కంటే వయస్సులో పెద్దగా ఉండటంతో కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చాయట. వీటివల్ల సమస్యలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకున్నారని కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం సంతోషంగా ఉన్నట్లు నమ్రత తెలిపారు.