SSMB29: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్‌లు కాదు!
SSMB29 ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా రెండు పార్ట్‌లు వస్తుందని అన్నారు. కానీ ఈ సినిమా మొత్తం రెండు పార్ట్‌లు రాదని, కేవలం ఒక పార్ట్ మాత్రమే వస్తుందని వార్తలు వస్తున్నాయి.

SSMB29: రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే.. ఎన్నో వార్తలు వస్తాయి. సినిమా సెట్స్ మీద ఉంటే.. ఫ్యాన్స్ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ కాంబోలో SSMB29 సినిమా వస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఫారిన్‌లో కూడా జరగనున్నట్లు సమాచారం. రాజమౌళి మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్‌తో పాటు మైథాలజీ టచ్ కూడా ఉంటుందని తెలిసిందే.
ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా రెండు పార్ట్‌లు వస్తుందని అన్నారు. కానీ ఈ సినిమా మొత్తం రెండు పార్ట్‌లు రాదని, కేవలం ఒక పార్ట్ మాత్రమే వస్తుందని వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాలా రెండు పార్ట్‌లు ఉండదు. కానీ ఈ సినిమాలనే ప్లానింగ్ బహుబలికి మించి ఉంటుందని అంటున్నారు. బాహుబలి రేంజ్‌లో సినిమా తీస్తున్న ఎగ్జిక్యూషన్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ తరహాలో ఉంటుందని తెలుస్తోంది. సినిమా సమయం ఎక్కువగా ఉంటుంది. కానీ రెండు పార్ట్‌లుగా తీయకుండా ఒక పార్ట్‌లోనే పూర్తి చేయాలని మూవీ టీం భావిస్తుందట. అయితే ఆలస్యంగా తీసినా కూడా రాజమౌళి మూవీ విషయంలో పెద్ద ప్లానింగ్‌తోనే ఉంటారు. మూవీలో కూడా ఎక్కువగా విఎఫ్‌ఎక్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా 2027లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవల ఓ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ షూటింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఈ వీడియోలో కనిపిస్తున్నాడు. అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొన్ని సందేహాలు మొదలవుతున్నాయి. ఇలాంటి సీన్లు గతంలోఎక్స్-మెన్ ఫ్రాంచైజీలో ఉండటంతో పాటు కొన్ని హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కూడా ఉంది. దీనివల్ల ఈ సినిమాలో సైన్స్ ఫిక్షన్ అంశాలు ఉంటాయనే వార్తలు జోరుగా వస్తున్నాయి. నిజానికి రాజమౌళి సినిమాల్లో కొత్తదనం, అడ్వెంచర్ ఉంటాయి. వీటితో పాటు ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
-
Mahesh And Rajamouli: మహేష్ ఫ్యాన్స్ కు షాక్.. జక్కన్న ఏం చేశాడంటే..
-
SSMB 29 Update: ఎస్ఎస్ఎంబీ 29 అప్డేట్.. రాజమౌళి ఏం చేస్తున్నారంటే..
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Baahubali the Epic: రీరిలీజ్‌కి సిద్ధమవుతున్న బాహుబలి ది ఎపిక్.. టూ పార్ట్స్ కలిపి ఒకేసారి.. ఎప్పుడంటే?
-
SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి