Jacqueline Fernandez : కేన్స్‌లో బాలీవుడ్ సీక్రెట్లను బయటపెట్టిన జాక్వెలిన్.. అంతా కలిసి తనను అలా చేశారట

Jacqueline Fernandez : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రెడ్ కార్పెట్‌పై తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, కేన్స్‌కు హాజరైన జాక్వెలిన్ అక్కడ బాలీవుడ్‌కు సంబంధించిన అనేక సీక్రెట్లను బయటపెట్టింది. అంతేకాకుండా బాలీవుడ్‌లో తనను చూసే విధానం గురించి కూడా మాట్లాడింది. కేన్స్ లో జాక్వెలిన్ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన కొన్ని విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జాక్వెలిన్ ఇటీవల బాలీవుడ్ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. బాలీవుడ్‌లో తనను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేశారని (stereotyped) ఆమె చెప్పింది.
Read Also:Mega 157: సంక్రాంతికి రఫ్ఫాడించేస్తాం అంటూ.. అనిల్-చిరంజీవి మూవీలో స్టార్ హీరయిన్
నన్ను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేశారు
కేన్స్‌లో ఉన్న జాక్వెలిన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’తో మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు ఇది తప్పుగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రజలు నాకు ఒక ప్రత్యేకమైన పాత్ర సరిపోతుందని భావించారు. ఆ తర్వాత నన్ను అలాంటి పాత్రలకే పరిమితం చేశారు. నాకు అదే సరిపోతుందని వారు అనుకుంటున్నారు. నా జర్నీ ఇలానే ఉంది. నేను ప్రజలకు చాలా కృతజ్ఞురాలిని. ఎందుకంటే నేను ఈ రోజు ఇక్కడి వరకు రాగలిగాను. ఈ స్థాయిలో ఉన్నాను. ఇండస్ట్రీలోని చాలా టాలెంటెడ్ పీపుల్ తో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని చెప్పింది.
Read Also:Ant Control Tips : ఇంట్లో చీమల బెడద ఉందా?.. రూ.5తో శాశ్వతంగా చెక్ పెట్టేయండి
నేను ఎలా కనిపిస్తానో అలాంటి పాత్రలే ఇస్తారు
జాక్వెలిన్ ఇంకా మాట్లాడుతూ.. ‘అయితే, నేను ఇంకా మంచిగా నటించగలను. నేను నన్ను మరింత మెరుగుపరచుకోవాలనుకుంటున్నాను. నేర్చుకోవాలనుకుంటున్నాను.ఎదగాలనుకుంటున్నాను. అన్వేషించాలనుకుంటున్నాను. మనందరికీ అది కోరుకునే హక్కు ఉంది. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో మీ వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే మీకు పని ఇస్తారు. నేను ఎలా కనిపిస్తానో నాకు అలాంటి పాత్రలే ఇస్తారు. డిఫరెంటుగా ఎక్కువగా చేసే అవకాశం నాకు లభించదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన జాక్వెలిన్ లుక్ చాలా చర్చనీయాంశమైంది. అయితే, జాక్వెలిన్‌కు కేన్స్‌లో ఇది మొదటిసారి కాదు. ఆమె ఇంతకు ముందు కూడా కనిపించింది. కాన్స్‌లో తన ఫస్ట్ టైం హాజరు గురించి జాక్వెలిన్ మాట్లాడుతూ.. తొలిసారి తనను ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది.
-
NTR : ‘వార్ 2’ మాత్రమే కాదు.. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్
-
Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
-
Keerti Suresh : పవర్ ఫుల్ పాత్రలో మహానటి.. మరో బాలీవుడ్ సినిమాలో కీర్తి సురేష్
-
Malayalam Movies: నానికి నచ్చిన మలయాళ మూవీస్ ఏంటో మీకు తెలుసా?
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు