Hari Hara Veera Mallu : ఆ ట్రైలర్ వస్తే థియేటర్లు బద్దలే.. ‘పీకే’ చివరి డైలాగ్ మామూలుగా ఉండదంట!

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక ట్రైలర్ కాదు, ఒక దృశ్య కావ్యం అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనిపించబోతున్నారు. మొఘల్ సామ్రాజ్యం శక్తిని ధిక్కరించిన ఒక ధైర్యవంతుడి పాత్రలో మరో పవన్ ను మనం వెండితెర మీద చూడబోతున్నాం.
Read Also:Yashasvi Jaiswal : రెండు సిక్స్ లు కొడితే చాలు.. ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న యశస్వి జైస్వాల్
ఈ ట్రైలర్లో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించే షాట్స్ చాలా ఉన్నాయట. లాంగ్ పోర్ట్రెయిట్ షాట్లు, హీరో గుర్రంపై దూసుకువచ్చే అద్భుతమైన సీన్లు, అడవి జంతువుల తో కొన్ని ప్రత్యేకమైన షాట్లు, గుండె దడదడలాడించే ఫైరింగ్ షాట్స్ అన్నీ ఉన్నాయట. ముఖ్యంగా, ‘పీకే’ చివరి డైలాగ్ ఈ ట్రైలర్‌కు హైలైట్ అని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండగే అవుతుందని, థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుందని చెబుతున్నారు.
Long portrait shots, horse riding shot, animals shots,firing shot,pk's last dialogue.Extraordinary cinematography a top notch quality trailer dropping in just 3️⃣ days.
PS : use headphones for the best sound effects and Mmk's adrenaline BGM #HariHaraVeeraMallu 🦅 pic.twitter.com/Y5wGTQYnSp
— àkrūthi (@Akruthi94) June 30, 2025
Read Also:Organ Donation : చనిపోయిన తర్వాత అవయవాలు ఎంత సేపు సజీవంగా ఉంటాయో తెలుసా ?
ఈ డైలాగ్‌తో పాటు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్‌కు ప్రాణం పోస్తుందట. అందుకే, ఈ ట్రైలర్‌ను చూసేటప్పుడు కచ్చితంగా హెడ్‌ఫోన్స్ వాడితేనే అసలు సౌండ్ ఎఫెక్ట్స్, బీజీఎం మజాను పూర్తిగా ఆస్వాదించగలరని చిత్ర యూనిట్ చెబుతోంది. ముందుగా క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి చాలా కష్టపడుతున్నారు. సినిమాకు తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సమయంలో క్రిష్ జాగర్లమూడి కూడా తన సహకారాన్ని కొనసాగిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా పని చేస్తూ, చిత్ర బృందం ప్రతి ఫ్రేమ్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది.
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Pawan Kalyan : పాకీజాపై పవన్ పెద్ద మనసు.. ఏం చేశాడంటే?
-
Pawan Kalyan leaves Cabinet Meeting: క్యాబినెట్ భేటీ నుంచి పవన్ బయటకు.. హుటాహుటిన హైదరాబాద్ కు!
-
Pawan Kalyan : పంచెకట్టులో పవర్ స్టార్..అదిరిపోయిన పవన్ కళ్యాణ్ కొత్త లుక్
-
Pawan Kalyan : ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫాం చేసుకున్న ‘హరి హర వీర మల్లు’.. ఎప్పుడంటే ?
-
Dhanush : పవన్ కళ్యాణ్ హీరోగా ధనుష్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే ?