Pooja Hegde: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ.. ఏకంగా సూపర్ స్టార్‌తో నటించే అవకాశం

Pooja Hegde:
బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నార్మల్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పూజా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముకుంద సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఖాళీగానే ఉంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ సినిమాకి కూడా పూజా సైన్ చేయలేదు. అయితే ఈ బుట్ట బొమ్మకు ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమాలో కూలీలో పూజా హెగ్డే నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇప్పుడు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ అయిన కూలీ (Coolie) సనిమాలో పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా మూవీ టీం తాజాగా విడుదల చేసింది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందా? లేకపోతే గెస్ట్ రోల్ లేదా? స్పెషల్ సాంగ్‌లో మెరవనుందా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కేవలం స్పెషల్ సాంగ్ కోసం పూజాను తీసుకున్నట్లు ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. దీంతో పూజా హెగ్డే మంచి ఆఫర్ కొట్టేసిందని అంటున్నారు. రజనీకాంత్ సరసన నటిస్తోందని మంచి ఆఫర్ కొట్టేసిందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు.
పూజా హెగ్డేకు స్పెషల్ సాంగ్ చేయడం కూడా కొత్త కాదు. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన జిగేలు రాణి సాంగ్ చేసింది. ఈ పాట అప్పట్లో యూత్‌ను బాగా ఉర్రూతలూగించింది. ఆ తర్వాత ఎఫ్3లో కూడా ప్రత్యేక పాటకు కూడా డ్యాన్స్ వేసింది. మళ్లీ ఇప్పుడు రజనీకాంత్‌తో కలిసి స్పెషల్ సాంగ్ చేయనుంది. పూజా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఏలింది. స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసింది. అరవింద సమేతా, అలా వైకుంఠపురం వంటి మంచి హిట్ సినిమాల్లో నటించింది. చిన్న, పెద్ద హీరోల అందరి సరసన కూడా మెరిసింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల విడుదలైన దేవా సినిమా కూడా పెద్ద డిజాస్టర్‌గా మారడంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. దీంతో పూజా తమిళంలో నటిస్తోంది. తమిళంలో పూజా చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలు ఉన్నాయి. సూర్య నటిస్తున్న రెట్రో సినిమాలో కూడా పూజానే హీరోయిన్. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా డీ గ్లామర్ లుక్ లో కనిపించనుంది. టీజర్ బట్టే తెలుస్తుంది.. ఆమె పాత్ర కాస్త కొత్తగా ఉంది. అలాగే తలపతి విజయ్ (Vijay Thalapathy) సరసన కూడా మరో సినిమా నటిస్తోంది. కేవలం తమిళంలోనే భారీ ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయి.