Salaar ReRelease : నెమ్మదించిన ‘సలార్’ రీ రిలీజ్ బుకింగ్స్..వచ్చిన గ్రాస్ ఇంతేనా?

Salaar ReRelease :
రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటించిన ‘సలార్'(Salaar ReRelease) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న ప్రభాస్ ని మళ్ళీ సూపర్ హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చిన సినిమా ఇది. 2023 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓటీటీ లో కూడా ఈ సినిమాకి అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. యూత్ ఆడియన్స్ లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాని, మరోసారి థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 21 వ తారీఖున ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని కొన్ని రోజుల క్రితమే ప్రారంభించారు.
ఆరంభం అదిరిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టిన రోజు ఏకంగా 22 వేలకు పైగా టిక్కెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి. దీంతో అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు కూడా సలార్ కచ్చితంగా ఆల్ టైం టాప్ 3 రీ రిలీజ్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ సినిమా కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని అయినా రాబడుతుందా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆరంభం లో అద్భుతమైన ట్రెండ్ ఉన్నప్పటికీ, ఆ తర్వాత మాత్రం చల్లారిపోయింది. హైదరాబాద్ లో పూర్తి స్థాయి బుకింగ్స్ ని ప్రారంభించిన తర్వాత బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు అనే విషయం స్పష్టమైంది. ప్రస్తుతం రీ రిలీజ్ రికార్డ్స్ అన్ని పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఖాతాలోనే ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి మొదటి రోజు 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇదే ఇప్పుడు మొదటి రోజు ఆల్ టైం రికార్డుని నెలకొల్పిన చిత్రం. ఇక ఫుల్ రన్ లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి చిత్రం ఉంది. ఈ సినిమాకు దాదాపుగా 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటి రోజున వచ్చాయి. ‘సలార్’ చిత్రానికి ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం సంగతి కాసేపు పక్కన పెడితే, కనీసం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రేంజ్ గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు. విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. రేపు ఎల్లుండి కలిపి మరో 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చు. రీ రిలీజ్ చిత్రాలకు కౌంటర్ బుకింగ్స్ జరగడం తక్కువ. కాబట్టి మహా అయితే రెండు కోట్ల రూపాయిల గ్రాస్, అంతకు మించి వచ్చే సూచనలు కనిపించడం లేదు.