Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Sankranthiki Vastunnam In Hindi For Sankranthi V

Sankranthiki Vastunnam: హిందీలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ రీమేక్.. నటించే ఆ స్టార్ హీరో ఎవరంటే?

Sankranthiki Vastunnam: హిందీలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ రీమేక్.. నటించే ఆ స్టార్ హీరో ఎవరంటే?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on February 23, 2025 / 06:41 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Sankranthiki Vastunnam:

హీరో వెంకటేష్ (Hero Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమా పండగ సందర్భంగా ధియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury) హీరోయిన్లుగా అలరించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై పాజిటివ్ టాక్ రావడతో పాటు రూ.300 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ప్రాంతీయ భాషలో వచ్చి రూ.300 కోట్లు రాబట్టిన సినిమాగా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు.

ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నారట. అక్షయ్ కుమార్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ చేశాడు. కానీ ఇలాంటి కామెడీలో ఉండే సినిమాలు చేయలేదు. దీంతో ఈ సినిమాను అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరనే విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరని ఫిక్స్ అయిన తర్వాత త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు సినిమాను వేరే డైరెక్టర్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు.

ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా టీవీలో మార్చి1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు ఇటీవల ప్రకటించింది. అయితే ఓటీటీ కంటే ముందుగానే టీవీల్లో ఈ సినిమా ప్రసారం కానుంది. మరి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఓటీటీలోకి వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీవీలో ఈ సినిమాకి భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం కూడా ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సెసిరోలియో సంగీతం వహించగా.. సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి.

Tag

  • Akshay Kumar
  • Dill raju
  • Remake
  • Venkatesh
Related News
  • Kannappa Movie : కన్నప్ప సినిమా చూసి కేసు పెడతామంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

  • Kannappa Full Movie Review: కన్నప్ప ఫుల్ మూవీ రివ్యూ

  • Kannappa Movie Twitter Review: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ

  • Kannappa : కన్నప్ప విడుదలకు ముందే క్రిటిక్స్, ట్రోలర్స్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నిర్మాతలు

  • Barkha Madan : గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసినిగా మారిన టాప్ హీరోయిన్.. ఎవరో తెలుసా ?

  • Trivikram following Anil Ravipudi: వెంకటేష్ విషయంలో త్రివిక్రమ్ కూడా అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాడా..?

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us