Rajamouli : రాజమౌళి మాతో ఒక్క సినిమా చేయి అంటూ బతిమిలాడుకున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?

Rajamouli :
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక దర్శకుడు రాజమౌళి(Rajamouli)… ఇలాంటి సక్సెస్ లను సాధించిన దర్శకులు ఇప్పటి వరకు ఎవ్వరు లేకపోవడం విశేషం. ఇక అందువల్లే రాజమౌళి సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంటుంది… ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంమైతే ఉంటుంది. దానికి న్యాయం చేయడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు…
స్టూడెంట్ నెంబర్ వన్(Student Number One) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాజమౌళి అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు సైతం ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూసే రోజులు కూడా వచ్చేసాయి. ఇక కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న రాజమౌళితో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఆసక్తి చూపించారు. ముఖ్యంగా కొంతమంది హీరోలైతే రాజమౌళిని బతిమిలాడుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
అప్పట్లో యమదొంగ(Yamadonga) సినిమా సమయంలో మోహన్ బాబు సైతం తన కొడుకు అయిన విష్ణు తో ఒక సినిమా చేయమని రాజమౌళిని అడిగారట. దానికి రాజమౌళి తనకున్న కమిట్మెంట్స్ గురించి చెప్పడంతో అయినా పర్లేదు అవి పూర్తయిన తర్వాత విష్ణు తో ఒక సినిమా చేయమని అనడంతో రాజమౌళికి ఏం చెప్పాలో అర్థం కాక ఇవి పూర్తి అయితే చూద్దామని చెప్పారట…
ఇక వీళ్లతో పాటుగా మరి కొంతమంది కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఉందని ఓపెన్ గా స్టేట్మెంట్ ని కూడా ఇచ్చారు. అయినప్పటికి రాజమౌళి మాత్రం ఎవ్వరి వాదనలు పట్టించుకోడు. తన కథకి ఎవరైతే న్యాయం చేయగలరో వాళ్లకు మాత్రమే తన సినిమాలో అవకాశాన్ని ఇస్తూ వాళ్ళని స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ రాజమౌళి చేసిన సినిమాలతో స్టార్ డమ్ ని అందుకున్న వారే కావడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తున్నాడు. ఆయన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ దొరికిన చాలు అనుకునే స్టార్ హీరోలు చాలామంది ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఫ్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ జరగకుండా పూర్తి చేయాలని ఉద్దేశంతో ఉన్నాడు.
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
SSMB29: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్లు కాదు!
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ