Viral Video: మహేష్‌తో సితారా కొత్త యాడ్.. వైరల్ అవుతున్న వీడియో
Viral Video:
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబుతో పాటు అతని కూతురు సితారకు (Sitara) హీరోయిన్ల అంత ఫాలోయింగ్ ఉంది. చిన్న వయస్సు నుంచే యాడ్స్ చేస్తోంది. సితార హీరోయిన్‌గా ఎప్పుడు సినిమాల్లో కనిపిస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఎప్పటికప్పుడు కొన్ని యాడ్స్ చేస్తూ ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. గత కొన్ని రోజుల కిందట పిఎమ్‌జే (PMJ) జ్యూయలర్స్ యాడ్ చేసిన సితార ఇప్పుడు తండ్రితో కలిసి ఓ యాడ్ చేసింది.
తండ్రితో కలిసి సినిమాలో కనిపించాలని చాలా మంది కోరిక. కానీ యాడ్ ద్వారా ఈ కోరికను ఇప్పట్లో ఆమె హీరొయిన్ గా కనిపిస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ, అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ తో అభిమానుల ఆశ తీరుస్తోంది. తాజాగా మరో యాడ్‌లో మహేష్ బాబుతో కలిసి సితార కనిపించింది. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూత్‌ను బాగా అట్రాక్ట్ చే సే జెన్ జెడ్ భాషను సితార మహేష్‌కు నేర్పిస్తుంది. ఒక దుస్తుల షాపు యాడ్. దీనికి సంబంధించిన యాడ్‌లో మహేష్, సితార షాపింగ్ చేస్తారు.
షాపింగ్ చేసిన తర్వాత బాగా షాపింగ్ ఎంజాయ్ చేసాం కదా అని మహేష్ బాబు సితారను అడుగుతాడు. దీంతో సితార ఓ డ్రస్‌ను విసిరితే మహేష్ బాబు మారిపోతాడు. వెంటనే అదిరిందిగా డ్రిప్ అని అనగా.. మహేష్‌కు అది అర్ధం కాలేదు. దీంతో మళ్లీ డ్రిప్ అంటుంది. డ్రిప్ అంటే వేసుకున్న అవుట్ ఫిట్ బాగుందని అర్థం. ఆ తర్వాత దిస్ ఈజ్ గ్రేట్ నాన్న… కానీ ఇప్పుడు నా వైబ్ ఇదే అని అంది. అయితే దీని అర్థం కూడా మహేష్‌కు అర్థమయ్యేలా సితార చెప్పింది.
దీన్ని మేం ఫామ్ అంటామని సితార తెలిపింది. అప్పుడు మహేష్ బాబు ఫామ్ జామ్ అని అంటారు. మీరు ఇప్పుడు అంతా అర్థమయ్యిందని అనడంతో యాడ్ పూర్తవుతుంది. మహేష్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తూనే మరో వైపు యాడ్‌లు చేస్తున్నారు. ఈ విధంగానే తన కూతురుతో యాడ్‌లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ మూవీ టీం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
-
SSMB29 Update: ఆర్ఆర్ఆర్ టీంను పక్కనపెట్టిన రాజమౌళి.. మహేష్ మూవీ కోసం కొత్త టీం..
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Fake Wedding trend: తినంత తిండి.. తాగేంత మందు.. ఫేక్ వెడ్డింగ్ ట్రెండ్. తో ఎంజాయ్ చేయండి