Vishwambhara: విశ్వంభరలో సందడి చేయనున్న మెగా డాటర్.. మాములుగా ఉండదుగా.. మెగా ఫ్యాన్స్‌కి పండగే

Vishwambhara:
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్నా చిత్రం విశ్వంభర (Vishwambhara). సోషియో ఫాంటసీ సినిమాగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులో ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. ఈ సెట్‌లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా ఈ సాంగ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాంగ్ షూటింగ్ జరుగుతోందని, ఇద్దరూ కూడా హాజరైనట్లు సమాచారం.
ఇంకో వారం పాటు పాట చిత్రీకరణ జరగనుంది. భారీ ఎత్తున ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. పాట అదిరిపోతుందని, మెగా మేనల్లుడు, డాటర్ ఉండటంతో సినిమా సాంగ్ బాగుంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్‌గా సౌత్ క్వీన్ త్రిష కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. మళ్లీ ఇప్పుడే కలిసి నటిస్తున్నారు. ఇందులో నా సామి రంగా ఫేమ్ ఆషికా రంగనాథ్ కూడా నటిస్తున్నారు. అలాగే ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విశ్వంభర సినిమాను సంక్రాంతికే విడుదల చేయాల్సింది. కానీ గేమ్ ఛేంజర్ కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే ఈ జగదేగ వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల అయిన రోజు మే 9న సినిమా రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. కానీ ఈ డేట్ కి కూడా సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జూన్‌లో సినిమా విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్ ప్లాన్ చేశారు. ఈ గ్రాఫిక్స్ కోసం దాదాపుగా రూ.100 కోట్లు ఖర్చు అవుతుంది. దీని కోసమే సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ ఆగస్టు తర్వాతే ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.