Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!

Indian Post: గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) 2025 రిజల్ట్స్ వచ్చేసాయి. ఇండియా పోస్ట్ ఈ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ఇండియా పోస్ట్ రిలీజ్ చేసిన జిడిఎస్ మెరిట్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్ Indiapostgdsonline.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ మెరిట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు ఎలాంటి పరీక్షకు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు. 10వ తరగతిలో సాధించిన మార్పులు ఆధారంగా సిస్టం జనరేటర్ మెరిట్ లిస్ట్ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనున్నారు. మార్కుల షీట్ లో ఇచ్చిన పర్సెంటేజ్ బట్టి మెరిట్ జనరేట్ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను జిడిఎస్ ఆన్లైన్ పోర్టల్ లో డిపార్ట్మెంట్ విడుదల చేస్తుంది. ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకటన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఫైనల్ రిజల్ట్స్, ఫిజికల్ వెరిఫికేషన్ తేదీలు సహా మరిన్నింటిని తెలపనున్నారు.
మెరిట్ లిస్ట్ చెక్ చేయడం ఎలా?
ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి
హోమ్ పేజీలో ఉన్న ఇండియా పోస్ట్ జిడిఎస్ మెరిట్ లిస్ట్ లింక్ పై నొక్కాలి.
రాష్ట్రాల వారీగా మెరిట్ లిస్ట్ ఉన్న కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
అక్కడ మీ రాష్ట్రం డివిజన్ సెలెక్ట్ చేయాలి.
ఆ తరువాత మెరిట్ లిస్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
అక్కడ మెరిట్ లిస్ట్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని పోస్టులు?
ఇండియా పోస్ట్ మొత్తం 21,413 జిడిఎస్ పోస్టులకు దరఖాస్తులు కోరింది. ఇందులో ఏపీలో 1215, తెలంగాణలో 519 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 10న ప్రారంభమైంది. ఇది మార్చ్ 3 వరకు కొనసాగింది.
-
UPSC సివిల్స్ రిజల్ట్స్.. టాప్ 10 ర్యాంకర్ల లిస్ట్ ఇదే
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి
-
Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !