Aluminum Foil : అల్యూమినియం ఫాయిల్ ఆహారానికి హానికరం అయితే.. మందుల ప్యాకేజింగ్ లో హానికాదా?

Aluminum Foil : అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని నిల్వ చేయడం ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది చెబుతూనే ఉంటారు. ఈ మాట తరచుగా వింటుంటాం. వేడి లేదా ఆమ్ల ఆహార పదార్థాలను (నిమ్మకాయ, టమోటా గ్రేవీ లేదా ఊరగాయ వంటివి) ఈ కవర్లలో ఉంచితే అల్యూమినియం కణాలు ఆహారంలో కలిసిపోతాయి. సో శరీరానికి హానికరం అని తరచుగా వింటాం కదా. మరి అల్యూమినియం అంత ప్రమాదకరమైనది అయితే దానిని మందుల ప్యాకేజింగ్‌లో (మెడిసిన్ ఇన్ అల్యూమినియం ఫాయిల్) ఎందుకు ఉపయోగిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా?
నిజానికి, అల్యూమినియం ఫాయిల్‌ను ఆహార ప్యాకేజింగ్, మందులు వంటి వివిధ అవసరాలలో ఉపయోగిస్తారు. అల్యూమినియం ఫాయిల్‌ను మందులలో ఎందుకు సురక్షితంగా పరిగణిస్తారో, ఆహారంలో దాని అధిక వాడకాన్ని నివారించమని ఎందుకు చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆహారంలో అల్యూమినియం ఫాయిల్ వాడటం ఎందుకు ప్రమాదకరం?
వేడి – ఆమ్ల ఆహారంలో లీకేజీ
మనం వేడి లేదా పుల్లని ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టినప్పుడు, ఫాయిల్లోని కొంత భాగం ఆహారంలో కరిగిపోవచ్చు. అల్యూమినియం పెద్ద మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తే, అది మెదడు, ఎముకలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది అంటున్నాయి అధ్యయనాలు. అంతే కాదు. ఇది అధిక ఉష్ణోగ్రతలు వద్ద ప్రమాదంకరంగా మారుతుంది. అల్యూమినియం ఫాయిల్‌ను ఓవెన్ లేదా తాండూర్‌లో ఉపయోగించడం వల్ల దాని చిన్న కణాలు ఆహారంలో కలిసిపోతాయి. ఇది శరీరంలో ఎక్కువ కాలం పేరుకుపోతుంది. నాడీ సంబంధిత సమస్యలను (అల్జీమర్స్ వంటివి) పెంచుతుంది. అల్యూమినియం తేలికైన లోహం అయినప్పటికీ, శరీరం దానిని తక్కువ పరిమాణంలో బయటకు పంపుతుంది. కానీ అది పెద్ద పరిమాణంలో పేరుకుపోతే, అది నాడీ వ్యవస్థ, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది.
మందుల ప్యాకింగ్‌లో ఎందుకు సురక్షితం:
అల్యూమినియం అంత హానికరం అయితే, దానిని మందుల స్ట్రిప్స్, ప్యాకింగ్లలో ఎందుకు ఉపయోగిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. మందులను హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తుంది ఇది. తేమ, ఆక్సిజన్, కాంతి, బ్యాక్టీరియా నుంచి మందులను రక్షించడానికి అల్యూమినియం ఫాయిల్ అత్యంత సురక్షితమైన మార్గం. మందులను ప్లాస్టిక్ లేదా మరేదైనా పదార్థంలో ప్యాక్ చేస్తే, అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది.
అల్యూమినియం శరీరంలోకి ప్రవేశించదు: ఔషధ ప్యాకేజింగ్‌లో ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్ ఔషధంతో ప్రత్యక్ష సంబంధంలో ఉండదు. ఎందుకంటే టాబ్లెట్ లేదా క్యాప్సూల్ రక్షణ పూతను కలిగి ఉంటాయి. సో హానికరమైన అల్యూమినియం కణాలు శరీరాన్ని చేరవు. దీనిని FDA, WHO లు ఆమోదించాయి.
వేడి లేదా ఆమ్ల ఆహారాలను అల్యూమినియం ఫాయిల్‌లో ఎక్కువసేపు ఉంచకూడదు. ఫాయిల్ ఉపయోగిస్తుంటే, నిర్దిష్ట ఉష్ణోగ్రత కోసం రూపొందించిన ఫాయిల్‌ను ఉపయోగించండి. మందులు రేకుతో ప్రత్యక్ష సంబంధంలోకి రావు కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?