Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Are You Wearing Fake Sindoor You Will Have Problems

Sindoor: కల్తీ సింధూరం పెట్టుకుంటున్నారా.. మీకు సమస్యలు తప్పవు

Sindoor: సాధారంగా సింధూరం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ సింధూరం ఎర్రగా ఉంటేనే ఎక్కువగా కొనుగోలు చేస్తారని కొందరు దీన్ని కల్తీ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ రంగులు కలుపుతున్నారు. వీటివల్ల సాధారణ రంగులో ఉండకుండా మరీ ఎక్కువ ఎరుపు రంగులో సింధూరం ఉంటుంది.

Sindoor: కల్తీ సింధూరం పెట్టుకుంటున్నారా.. మీకు సమస్యలు తప్పవు
  • Edited By: NARESH ENNAM,
  • Updated on May 10, 2025 / 05:54 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Sindoor: హిందూ సంప్రదాయంలో సింధూరానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ పూజకు దీన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. మహిళలకు ఐదోతనానికి గుర్తుగా సింధూరాన్ని వాడుతారు. హిందువులు అయిన ప్రతీ మహిళా కూడా తప్పకుండా దీన్ని పెట్టుకుంటారు. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా వాడుతారు. కొందరు సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే.. మరికొందరు పాపిట్లో పెట్టుకుంటారు. ఇలా సింధూరం పెట్టుకున్న మహిళలు చూడటానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తారు. కేవలం పెళ్లయిన వారే కాకుండా పెళ్లి కాని వారు కూడా కుంకుమను ధరిస్తారు. అయితే ప్రస్తుతం రోజుల్లో కుంకుమ కూడా కల్తీ అవుతుంది. పూర్వం కుంకుమను ఇంట్లోనే తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమయ్యే దాన్ని వాడుతున్నారు. ఆపరేషన్ సిందూర్‌తో దీని ప్రత్యేకతలు చాలా మంది తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కల్తీ సింధూరం పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అయితే కల్తీ సింధూరం ధరించడం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

సాధారంగా సింధూరం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ సింధూరం ఎర్రగా ఉంటేనే ఎక్కువగా కొనుగోలు చేస్తారని కొందరు దీన్ని కల్తీ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ రంగులు కలుపుతున్నారు. వీటివల్ల సాధారణ రంగులో ఉండకుండా మరీ ఎక్కువ ఎరుపు రంగులో సింధూరం ఉంటుంది. అలాగే సింధూరం మెరవడానికి లెడ్‌-మెర్క్యురీ వంటి రసాయనాలను వాడుతారు. వీటిని వాడిన సింధూరం చర్మానికి పెట్టుకుంటే.. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలర్జీలు, దద్దుర్లు, దురద వంటివి సింధూరం పెట్టే ప్రదేశంలో వస్తుంది. అలాగే ఆ ప్లేస్‌లో చర్మం ఎరుపు కూడా ఎక్కుతుంది. ఎక్కువగా ఇలాంటి రసాయనాలు ఉన్న సింధూరం వాడటం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు మూత్రపిండాల సమస్యలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మార్కెట్‌లో లభ్యమయ్యే సింధూరం కంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే మహిళలు జీవితంలో సింధూరం అనేది చాలా ముఖ్యమైనది. తప్పకుండా దీన్ని డైలీ కూడా వాడుతారు. అసలు సింధూరం లేకుండా ఏ మహిళ కూడా కనిపించదు. ఇప్పుడంటే జనరేషన్ మొత్తం మారిపోయింది. ఫ్యాషన్‌కు ఎక్కువ విలువ ఇచ్చి చాలా మంది కనీసం సింధూరం పెట్టుకోవడం మానేశారు. కానీ ఒకప్పుడు మాత్రం తప్పకుండా సింధూరాన్ని పెట్టుకునే వారు. చర్మ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా క్వాలిటీ ఉన్న మంచి సింధూరం వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. పూర్వం దీన్ని ఇంట్లోనే తయారు చేసుకునే వారు. ఇప్పుడు అయితే వ్యక్తిగత విషయాలతో బిజీగా ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా కల్తీ వాటిని వాడి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • Fake Sindoor
  • Lifestyle News
  • Pure Kumkum
  • Sindoor
  • Telugu Latest News
Related News
  • Eat this food: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుకుంటున్నారా.. ఈ ఫుడ్ తీసుకోండి

  • Black Ants in House: ఇంట్లో నల్ల చీమలు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?

  • Tight Clothes: బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే.. ప్రెగ్నెన్సీ రావడం కష్టమేనా?

  • Sindoor Powder: ప్యూర్ సింధూరం.. ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us