Sindoor Powder: ప్యూర్ సింధూరం.. ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలా?
Sindoor Powder: ఆపరేషన్ సిందూర్‌తో దీని ప్రత్యేకతలు చాలా మంది తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కల్తీ సింధూరం పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అయితే ఎలాంటి సమస్యలు సింధూరం వల్ల రాకూడదంటే..

Sindoor Powder: మహిళలకు ఐదోతనానికి గుర్తుగా సింధూరాన్ని వాడుతారు. హిందూ సంప్రదాయంలో సింధూరానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ పూజకు దీన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. హిందువులు అయిన ప్రతీ మహిళా కూడా తప్పకుండా దీన్ని పెట్టుకుంటారు. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా వాడుతారు. కొందరు సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే.. మరికొందరు పాపిట్లో పెట్టుకుంటారు. ఇలా సింధూరం పెట్టుకున్న మహిళలు చూడటానికి కూడా ఎంతో అందంగా కనిపిస్తారు. కేవలం పెళ్లయిన వారే కాకుండా పెళ్లి కాని వారు కూడా కుంకుమను ధరిస్తారు. అయితే ప్రస్తుతం రోజుల్లో కుంకుమ కూడా కల్తీ అవుతుంది. పూర్వం కుంకుమను ఇంట్లోనే తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమయ్యే దాన్ని వాడుతున్నారు. ఆపరేషన్ సిందూర్‌తో దీని ప్రత్యేకతలు చాలా మంది తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కల్తీ సింధూరం పెట్టుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అయితే ఎలాంటి సమస్యలు సింధూరం వల్ల రాకూడదంటే.. సహజంగా ఇంట్లోనే సింధూరాన్ని తయారు చేసుకోవాలి. మరి ఇంట్లోనే ప్యూర్ సింధూరం తయారు చేసుకోవడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లోనే సహజంగా సింధూరాన్ని తయారు చేసుకోవాలంటే చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. దీన్ని తయారు చేయడానికి సేంద్రియ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ ఒక టేబుల్ స్పూ్న్, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్‌తో పాటు చిటికెడు సున్నం కూడా కావాలి. అయితే వీటిని తీసుకున్న తర్వాత ఒక మిక్సీజార్‌లోకి పసుపు, నెయ్యి, రోజ్ వాటర్, నిమ్మరసం, సున్నం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటి కలయిక వల్ల ఆ మిశ్రమం ఎర్రగా మారుతుంది. ఇలా ఎర్రగా మారిన తర్వాత దాన్ని ఒక ప్లే్ట్‌లోకి తీసుకుని ఆరనివ్వాలి. బాగా ఎండిన తర్వాత పొడిగా ఆ మిశ్రమం మారుతుంది. అంతే ఇక నేచురల్ సింధూరం తయారు అయినట్లే. ఇందులో ఎలాంటి రసాయనాలు లేకపోవడం వల్ల దీనవల్ల అనారోగ్య సమస్యలు రావు. పొడిపొడిగా మారిన తర్వాత కుంకుమ భరణిలోకి తీసుకుని వాడుకుంటే నేచురల్ కుంకుమ రెడీ. ఈ కుంకుమ మంచి సువాసన కూడా కలిగి ఉంటుంది. దీనిని పెట్టుకోవడం వల్ల చర్మ సమస్యలు కూడా రావు. ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది.
రసాయనాలు ఉండే సింధూరం వాడటం వల్ల సమస్యలు వస్తాయి. ఇందులో ఆర్టిఫిషియల్ రంగులు కలుపుతున్నారు. వీటివల్ల సాధారణ రంగులో ఉండకుండా మరీ ఎక్కువ ఎరుపు రంగులో సింధూరం ఉంటుంది. అలాగే సింధూరం మెరవడానికి లెడ్-మెర్క్యురీ వంటి రసాయనాలను వాడుతారు. వీటిని వాడిన సింధూరం చర్మానికి పెట్టుకుంటే.. చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అలర్జీలు, దద్దుర్లు, దురద వంటివి సింధూరం పెట్టే ప్రదేశంలో వస్తుంది. అలాగే ఆ ప్లేస్‌లో చర్మం ఎరుపు కూడా ఎక్కుతుంది. ఎక్కువగా ఇలాంటి రసాయనాలు ఉన్న సింధూరం వాడటం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు మూత్రపిండాల సమస్యలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సహజంగా ఉండే సింధూరాన్ని మాత్రమే ఉపయోగించండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.