Summer: వేసవిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోండిలా!
Summer వేసవిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు A, C, D, E, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.

Summer:వేసవిలో తీవ్రమైన ఎండల వల్ల చాలా మందికి అలసట, నీరసం వస్తుంది. ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతే దగ్గు, జ్వరం, జలుబు వంటి సమస్యలు వస్తాయి. చెమట వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు చర్మంపై వస్తాయి. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. అయితే వేసవిలో రోగనిరోధక శక్తి వేసవిలో తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటిస్తే పెరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాలు ఉండే ఆహారం
వేసవిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి పోషకాలు ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు A, C, D, E, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. వేసవిలో ఇవి ఉన్న పదార్థాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు, గింజలు, పాలు, పెరుగు వంటి వాటిని తీసుకోవాలి.
తగినంత నిద్ర
వేసవిలో ఉక్కపోత వల్ల చాలా మంది తక్కువగా నిద్రపోతారు. దీంతో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి రోజుకి సరిపడా నిద్రపోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ సమయం నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
శారీరక శ్రమ
వేసవిలో సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లి ఆడటం, రన్నింగ్ వంటివి చేయాలి. ఇలా చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
హైడ్రేషన్
వేసవిలో ఎక్కువగా వాటర్, పండ్ల రసాలు తాగాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వేసవిలో వడదెబ్బ వంటివి కూడా రావని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఆరోగ్యం
వేసవిలో ఎండ వల్ల కొందరికి ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. దీంతో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉండండి.
శుభ్రత లేకపోవడం
రోగనిరోధక శక్తి తగ్గిపోవడానికి ముఖ్య కారణం శుభ్రత లేకపోవడం. దీనివల్ల ఆటోమెటిక్‌గా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి వేసవిలో బయటకు వెళ్లి వచ్చాక కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోండి. దీనివల్ల ఎలాంటి క్రిములు కూడా చేరవు.
సిట్రస్ పండ్లు
వేసవిలో ఎక్కువగా సిట్రస్ పండ్లను తీసుకోండి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో వేసవిలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు పసుపు పాలు తాగడం, పుచ్చకాయ, పండ్ల రసాలు, జ్యూస్‌లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Summer Health Tips: వేసవిలో వీటిని తీసుకోండి శరీరం చల్లగా ఉంటుంది.
-
Summer : సమ్మర్ లో ప్రయాణమా? ఇవి మస్ట్..
-
Summer Health Tips: ఎండాకాలం మొదలైంది. ఉప్పు నీరు తాగుతున్నారా?
-
Summer Health Tips: ఎండాకాలంలో వచ్చే వ్యాధులు, లక్షణాలు.. తస్మాత్ జాగ్రత్త
-
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
-
Summer Health Tips: వేసవిలో చల్లగా ఉండాలంటే ఇలా చేయండి