Cancer: క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు టీకా.. ఎప్పటినుంచంటే!

Cancer: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది క్యాన్సర్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఈ సమస్యతో చనిపోతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు దీనికి కారణం. అయితే క్యాన్సర్‌కు మందు లేదు. కేవలం చికిత్స మాత్రమే. అయితే దీన్ని ముందుగానే ఎదుర్కొనేందుకు కేంద్రం ఓ శుభవార్త తెలిపింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రాల్ జాదవ్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేశారు. మహిళలు తీవ్రంగా ఎదుర్కొంటున్న క్యాన్సర్లను నివారించేందుకు ఐదారు నెలల్లోనే టీకా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. మహిళల ఆరోగ్యాన్ని కొన్ని రకాల క్యాన్సర్లు ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. వీటి బారిన పడి ప్రతి ఏటా లక్షల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇందుకోసమే కేంద్రం ముందడుగు వేసింది. మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే కొన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు త్వరలోనే టీకాను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ వెల్లడించారు.
త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న ఈ టీకా 9 నుంచి 16 ఏళ్లలోపు వయసు ఉన్న బాలికలు మాత్రమే తీసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు. ఈ టీకాపై ఇప్పటికే పరిశోధనలు పూర్తయి ట్రాయిల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. దేశంలో రోజురోజుకీ క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర చత్రపతి శంభాజీ నగర్ లో ఈ విషయంపై మాట్లాడిన మంత్రి.. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 30 ఏళ్ల పైబడిన మహిళలకు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తామని.. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డెకేర్ క్యాన్సర్ కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇక త్వరలోనే అందుబాటులోకి రాబోతున్న ఈ టీకా రొమ్ము క్యాన్సర్ తో పాటు గర్భాశయ, నోటి క్యాన్సర్లను నియంత్రిస్తుందని తెలిపారు. అయితే కేవలం 9 నుంచి 16 ఏళ్లలోపు వయసు ఉన్న బాలికలు మాత్రమే ఈ టీకాను తీసుకున్నందుకు అర్హులని వెల్లడించారు.
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Cancer: పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
-
Cancer: సన్ స్క్రీన్ క్యాన్సర్ ను తెస్తుందా? క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా?
-
Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే మీరే సులభంగా గుర్తించవచ్చు? ఎలాగంటే?
-
Sugar: షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజమెంత?
-
Cancer fruit : క్యాన్సర్ ను తరిమి కొట్టే పండు.. ఒక్కటి తింటే చాలు.. ఇంతకీ ఏం పండు అంటే?