Chicken: చికెన్ అతిగా తినేవారికి పొంచి ఉన్న ప్రమాదం

Chicken: చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. ఒక్క పూట కాదు.. రోజులో మూడు పూటలు కూడా చికెన్ పెడితే ఇష్టంగా తింటారు. ఏదో తప్పక వెజ్ తింటారు.. అంతే కానీ డైలీ నాన్‌వెజ్ తినాలని ఉంటుంది. అయితే నాన్‌వెజ్‌లో చాలా మందికి చికెన్ అంటేనే చాలా ఇష్టం. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. కండరాలను బలంగా ఉంచుతాయి. అయితే చికెన్‌ను ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ అధిక మొత్తంలో తీసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఏ పదార్థం అయినా కూడా లిమిట్‌లోనే తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే చికెన్ అతిగా తీసుకుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. అలా అని ఎక్కువగా వీటిని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి. చికెన్ అధికంగా తింటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్య మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందట. ఎంత ఆరోగ్యానికి మంచిది అయినా కూడా అతిగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 300 గ్రాముల కన్నా ఎక్కువ చికెన్ తినకూడదు. దీని కంటే ఎక్కువగా తింటే మాత్రం తప్పకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. వీటితో పాటు పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే వారానికి 100 గ్రాముల కంటే తక్కువగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం రోజుల్లో ఇంట్లో కంటే బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. పొరపాటున బయటకు వెళ్లినా కూడా బిర్యానీ తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఇంట్లో చేసుకున్న ఫుడ్ కాస్త బాగానే ఉంటుంది. కానీ బయట ఫుడ్ అయితే ఎక్కువగా స్టా్క్ ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయట చికెన్ తినకపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాంసంలో ఎలాంటి పోషకాలు ఉండవు. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయట చికెన్ అసలు తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com ని
-
Breakfast: బ్రేక్ ఫాస్ట్ టైంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Cancer: ఈ పదార్థాలు తీసుకుంటే.. క్యాన్సర్ నుంచి విముక్తి
-
Cancer: పాలియేటివ్ కేర్‌తో క్యాన్సర్ నుంచి ఉపశమనం
-
Cancer: సన్ స్క్రీన్ క్యాన్సర్ ను తెస్తుందా? క్యాన్సర్ రాకుండా కాపాడుతుందా?
-
Health Issues: ఎక్కువగా చెమటలు వస్తున్నాయా.. మీకు ఈ సమస్యలు ఉన్నట్లే