Children : పిల్లల కళ్ళకు కాటుక పెడుతున్నారా? దీని వల్ల వారికి మంచా? చెడా?

Children : అబ్బ పిల్లలు పుట్టగానే ఫుల్ మసాజ్, కళ్లకు కాజల్ పెడుతుంటారు పెద్దలు. ఈ కాలం వారికి వీటి గురించి కాస్త తక్కువగా కనిపించినా సరే కానీ ఇంట్లో పెద్దలు ఉంటే మాత్రం మసాజ్, కాజల్ ఉపయోగం ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సార్లు తల్లులు వద్దు అంటారు. అయినా సరే వినకుండా కళ్లకు కాటుక పెడతారు. ఇక డాక్టర్లు వద్దు అనిచెప్పినా సరే వారికి మసాజ్ కూడా చేస్తుంటారు. మా కాలంలో మేము చేశాము.. మాకు తెలియదా? ఇప్పుడు కాటుక వద్దు, మసాజ్ వద్దు అంటున్నారు అని ఓ రెండు చివాట్లు పెట్టి మరి వారు కేర్ తీసుకుంటారు. మసాజ్ ఒకే మరి కళ్లకు ఈ కాటుక మంచిదేనా కాదా అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మనందరి కళ్ళ పైభాగంలో లాక్రిమల్ గ్రంథి ఉంటుంది. ఇది కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది. మనం కన్ను రెప్ప వేసినప్పుడు, కన్నీళ్లు కార్నియా అంతటా వ్యాపించి కన్నీటి నాళాల గుండా వెళతాయి. కళ్ళు పొడిబారడం, ధూళి, దుమ్ము వంటి వాటి నుంచి రక్షించి కన్నీళ్లు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మీరు మీ కళ్ళకు కాజల్ రాసుకున్నప్పుడు, కన్నీటి వాహిక మూసుకుపోవచ్చు.
మస్కారా పిల్లల కళ్ళను పెద్దదిగా చేస్తుందా?
కాజల్ పూయడం వల్ల పిల్లల కళ్ళ నిర్మాణంలో ఎటువంటి తేడా ఉండదు. దీనివల్ల కళ్ళు ప్రకాశవంతంగా, మరింత అందంగా కనిపిస్తాయి అంతే. కానీ వాటి పరిమాణం అస్సలు మారదు. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న కాజల్ లాంటి వాటిని పిల్లలకు పెట్టకపోవడమే బెటర్. ఎందుకంటే పిల్లల కళ్ళు, చర్మం చాలా సున్నితంగా ఉంటాయి. ఈ కాటుక వల్ల వారికి ఇన్ఫెక్షన్ సోకుతుంది.
మస్కారా వేయడం వల్ల కళ్ళకు కలిగే హాని ఏమిటి?
కాటుక పూయడం వల్ల పిల్లల కళ్ళలో చికాకు కలుగుతుంది. కాటుక కళ్ళు ఎర్రబడటానికి, నీరు కారడానికి కారణమవుతుంది. జిడ్డుగా ఉంటుంది. దానిని పూసినప్పుడు, దుమ్ము, ధూళి పిల్లల కళ్ళకు అంటుకుంటాయి. ఇది బ్యాక్టీరియాను ఆకర్షించి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. కొంతమంది పిల్లలకు కాటుక అంటే అలెర్జీ కూడా ఉండవచ్చు.
పిల్లలు కాటుక వేసుకోకూడదా?
మీ పిల్లలకు కాటుక అప్లై చేయాలనుకుంటే, ఇంట్లో తయారుచేసిన కాటుక అప్లై చేయవచ్చు. మార్కెట్లో లభించే కాటుకలో రసాయనాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లలకు దీనిని పూయడం హానికరం. దీని కారణంగా వారికి చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో స్కిప్ చేయడం బెటర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Woman : మన ఇంటిని చక్కదిద్దే మహిళకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి?
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..