Child’s Brain : పిల్లల మెదడు వీక్ గా ఉందా స్ట్రాంగ్ గా ఉందా? ఇలా తెలుసుకోండి.
Child's Brain : మంచి పాఠశాలలో అడ్మిషన్, ఇంట్లో ట్యూషన్, క్రీడలకు కోచింగ్ వంటి అనేక సౌకర్యాలను కూడా అందించేలా చూస్తారు. కానీ ఇవి మాత్రమే పిల్లల మనస్సును పదును పెట్టడానికి సరిపోతాయా అంటే కావు అంటున్నారు నిపుణులు. మరింత ప్రయత్నాలు మీరు చేయాల్సిందే. ఇంతకీ అవేంటంటే?

Child’s Brain : ప్రతి తల్లిదండ్రి కూడా తమ బిడ్డ మైండ్ షార్ప్ గా ఉండాలని, స్పీడ్ గా ఉండాలని మెదడు ఐన్‌స్టీన్ లాగా చురుకైనదిగా అవ్వాలని కోరుకుంటారు. చదువులో మంచివారు అవ్వాలి. అన్ని చోట్లా టాపర్ అవ్వాలి అనుకుంటారు. మంచి పాఠశాలలో అడ్మిషన్, ఇంట్లో ట్యూషన్, క్రీడలకు కోచింగ్ వంటి అనేక సౌకర్యాలను కూడా అందించేలా చూస్తారు. కానీ ఇవి మాత్రమే పిల్లల మనస్సును పదును పెట్టడానికి సరిపోతాయా అంటే కావు అంటున్నారు నిపుణులు. మరింత ప్రయత్నాలు మీరు చేయాల్సిందే. ఇంతకీ అవేంటంటే?
ఈ రోజుల్లో పిల్లలు అనారోగ్యకరమైన ఆహారం తినడం, గాడ్జెట్‌లను ఎక్కువగా వాడటం, అధిక ఒత్తిడి వంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వారి జ్ఞాపకశక్తిని తగ్గించడమే కాకుండా వారి మెదడును కూడా బలహీనపరుస్తుంది.అయితే ఇవన్నింటి వల్ల మీ బిడ్డ మెదడు బలహీనంగా ఉందని మీరు అనుకుంటున్నారా? కానీ టెన్షన్ అవసరం లేదు. మీ పిల్లోడి బ్రెయిన్ షార్ప్ ఉందో లేదో జస్ట్ కొన్ని టెస్ట్ ల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే?
పిల్లల మెదడు బలహీనపడటానికి కారణాలు: డిజిటల్ గాడ్జెట్‌లను అధికంగా ఉపయోగించడం అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారం, నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆటలకు దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడి వంటివి వారి బ్రెయిన్ ను ఇబ్బంది పెడుతున్నాయి.
జ్ఞాపకశక్తి పరీక్ష: మీ బిడ్డకు పెన్ను, టేబుల్, పుస్తకం, మొబైల్, గాజు వంటి 5 సాధారణ వస్తువుల పేర్లు చెప్పండి. 1 నిమిషం తర్వాత అతనికి ఎన్ని పేర్లు గుర్తున్నాయో అడగండి. ఒక పిల్లవాడు 4-5 పేర్లను గుర్తుంచుకుంటే అతని మనస్సు దృఢంగా ఉన్నట్టు ఏ టెన్షన్ లేనట్టే. వారు 2-3 పేర్లను మాత్రమే గుర్తుంచుకుంటే.. మీరు శ్రద్ధ వహించాల్సిందే. వారు 1 పేరు కూడా గుర్తుపెట్టుకోలేకపోతే భయపడాల్సిన పరిస్థితే.
దృష్టి పరీక్ష: పిల్లవాడిని గోడపై ఉన్న గడియారం వంటి ఒకే వస్తువును 30 సెకన్ల పాటు జాగ్రత్తగా చూడమని చెప్పండి. పిల్లవాడు పరధ్యానం లేకుండా చూడగలిగితే, అతని ఏకాగ్రత సామర్థ్యం బాగుంటుంది. అతను పదే పదే ఇక్కడ, అక్కడ చూడటం ప్రారంభిస్తే, అతని దృష్టి మళ్లుతోందని అర్థం చేసుకోండి.
నిర్ణయం తీసుకునే పరీక్ష: పిల్లవాడిని ఆపిల్ లేదా అరటిపండు వంటి రెండు వస్తువులలో ఒకదాన్ని ఎంచుకోమని అడగండి. అతను ఎంచుకున్నప్పుడు, అతను అలా ఎందుకు చేశాడో అడగండి. అతను వెంటనే సమాధానం ఇస్తే అతని ఆలోచనా సామర్థ్యం, అవగాహన సామర్థ్యం బాగుందని అర్థం చేసుకోండి. అతను చాలా ఆలోచించిన తర్వాత సమాధానం ఇస్తే లేదా గందరగోళంగా ఉంటే, అప్రమత్తంగా ఉండటం మంచిది.
ప్రతిస్పందన పరీక్ష: అకస్మాత్తుగా పిల్లల ముందు చప్పట్లు కొట్టండి. లేదా ఒక సాధారణ ప్రశ్న అడగండి. పిల్లవాడు వెంటనే స్పందిస్తే, అతని మెదడు సరిగ్గా పనిచేస్తుందని అర్థం. ఎక్కువ సమయం తీసుకుంటుంటే అది మెదడు బలహీనపడటానికి సంకేతం.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.