Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?

Curd rice:
చాలా మంది ఆరోగ్యానికి మంచిదని పెరుగు, అరటి పండ్లు తీసుకుంటారు. అయితే కొందరు వీటిని వేర్వేరుగా తీసుకుంటారు. మరికొందరు ఈ రెండింటిని కలిపి తీసుకుంటారు. చాలా మందికి పెరుగన్నంలో అరటి పండు కలిపి తినే అలవాటు ఉంటుంది. కేవలం వేసవిలోనే కాకుండా ఏ సీజన్‌లో అయినా ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా వేసవిలో తింటే బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగు అన్ని విధాలుగా మంచిగా చేస్తుంది. చాలా మంది డైలీ డైట్‌లో తప్పకుండా పెరుగు తీసుకుంటారు. అలాగే రోజుకొకొ అరటి పండును కూడా తింటారు. అరటి పండ్లను తినడం వల్ల కూడా శరీరానికి పోషకాలు అందుతాయి. అయితే పెరుగన్నంలో అరటి పండ్లను కలిపి తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
వేడి తగ్గుతుంది
వేసవిలో పెరుగన్నం తినడం వల్ల బాడీ వేడి తగ్గు్తుంది. చాలా మందికి వేసవిలో బాడీ ఆటోమెటిక్‌గా వేడి అవుతుంది. దీనివల్ల కాస్త చిరాకుగా ఉంటుంది. అదే పెరుగన్నంలో అరటి పండ్లు వేసుకుని తింటే బాడీతో పాటు కడుపు చల్లగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి వంటివి రాకుండా కాపాడుతుంది.
హైడ్రేషన్
వేసవిలో ఆటోమెటిక్‌గా బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అదే పెరుగు, అరటి పండు కలిపి తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఎలాంటి వేడి సమస్యలు రావు. మీ కడుపు చల్లగా ఉండటం వల్ల బాడీ కూడా డీ హైడ్రేషన్‌కు గురి కాదు. దీనివల్ల మీరు యాక్టివ్‌గా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారు. సాధారణంగానే వేసవిలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలు
వేసవిలో బాడీ వేడికి గురై ఎక్కువగా జీర్ణ సమస్యలు వస్తాయి. వీటివల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. అలాగే అరటి పండులో హెల్తీ గట్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. వేసవిలో వచ్చే అన్ని రకాల జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. వీటితో పాటు అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా పెరుగులో అరటి పండ్లు వేసుకుని తినడం మంచిది.
వెయిట్ లాస్
ఇలా తినడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే పెరుగులోని ప్రొబయెటిక్స్ శరీరంలోని కేలరీలను తగ్గిస్తుంది. దీంతో మీ శరీరంలో ఎంత కొవ్వు ఉన్నా కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. మీరు ఎంత బరువు ఉన్నా కూడా తగ్గిపోయి.. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు.
మలబద్ధకం
పెరుగు, అరటి పండు వల్ల జీర్ణం త్వరగా అవుతుంది. దీంతో మీకు మలబద్ధకం సమస్య ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. ఇందులోని ఫైబర మలబద్ధకం సమస్యలు అన్నింటిని కూడా క్లియర్ చేస్తుంది. వేసవిలో డైలీ వీటిని తింటే ఆరోగ్యంగా ఉంటారు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Weight Loss: ఒక నెలలో ఎంత బరువు తగ్గాలి? ఏది మంచిది?
-
Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..
-
Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్
-
Sudden Weight Loss: తొందరగా బరువు తగ్గుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Curd : వీరికి పెరుగు విషం లాంటిది.. ఎవరు తినవద్దు అంటే?