High Blood Pressure: పిల్లలకు హై బీపీ సమస్య ఉందా? అయితే నిద్ర మస్ట్.

High Blood Pressure: ప్రస్తుతం ఉన్న బిజీ కారణంగా చాలా మంది సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. నిద్ర చాలా డిస్ట్రబ్ అవుతుందనే చెప్పాలి. షిఫ్టుల వల్ల త్వరగా లేవడం, రాత్రి ఆలస్యంగా పడుకోవడం, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల సరైన నిద్రకు దూరం అవుతున్నారు ప్రజలు. అయితే కచ్చితంగా రోజుకు 6 గంటల కన్నా ఎక్కువ నిద్ర అవసరం. లేదంటే మీ మెదడు పనితీరు చాలా దెబ్బతింటుంది. ఇక ఈ నిద్ర బీపీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సరైన నిద్ర లేకపోతే బీపీ సమస్యలతో బాధ పడాల్సిందే. కానీ సరైన నిద్ర హై బీపీతో బాధ పడే వారికి మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు.
నిద్ర లేకపోవడం వల్ల మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అయితే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే సరైన నిద్ర ఉన్న వారు హై బీపీ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతున్నారు. సరిగ్గా నిద్ర పోని వ్యక్తులలో మెదడు నిర్మాణానికి సంబంధించిన మార్పులు కూడా కనిపించాయి అంటున్నాయి పరిశోధనలు. ఇక వారి ఆలోచనలు, పనుల్లో కూడా చాలా మార్పు ఉంటుందట. మరీ ముఖ్యంగా నిద్ర పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. వారికి సరైన నిద్ర ఉంటే హై బీపీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చట.
అందుకే ఏ వయసు వారైన సరే సరిగ్గా నిద్ర పోవడం చాలా ముఖ్యం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా మంచి నిద్రను పొందాలి. వయసును బట్టి నిద్ర టైమింగ్స్ కూడా ఉంటాయి. ఇక 18 ఏళ్లు పై బడిన ప్రతి ఒక్కరు కూడా 6 గంటలకు తగ్గకుండా పడుకోవాలి. లేదంటే మీ మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక పిల్లలు రోజుకు 9 నుంచి 11 గంటలు నిద్రిస్తే అధిక రక్తపోటు ముప్పు ఏకంగా 37 శాతం తగ్గుతుందట. యూటీ హెల్త్ హైస్టన్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
అందుకే పిల్లలకు తగినంత నిద్ర అవసరం అని మరోసారి రుజువు అయింది. పడుకునే ముందు టీవీ, పీసీ, ల్యాప్ టాప్, మొబైల్ వంటి వాటికి పెద్దలు దూరంగా ఉండాలి. పిల్లలను కూడా దూరంగా ఉంచాలి. లేదంటే వారి ఆరోగ్యానికి, మీ ఆరోగ్యానికి ప్రమాదం. పిల్లలు పడుకునే పడకగది చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. హై బీపీ ఉంటే వారి పడకగది శబ్దాలకు కాస్త దూరంలోనే ఉంచాలి. మంచి నిద్ర గాఢ నిద్ర వారిని హై బీపీ నుంచి దూరం చేస్తుంది.
పిల్లలు, పెద్దలు నిద్ర విషయంలో రాజీ పడితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర, ఆహారం, సరైన జీవనశైలిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సో ఈ రెండు విషయాలను చాలా గుర్తు పెట్టుకోవాలి. ఆహారం విషయంలో ఎంత జాగ్రత్త అవసరమో.. నిద్ర విషయంలో కూడా అంతే జాగ్రత్త అవసరం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?