Ice Cream :ఐస్‌క్రీమ్ తింటే నిజంగానే శరీరానికి చలవ చేస్తుందా?..నిపుణులు ఏమంటున్నారంటే ?

Ice Cream : వేసవి కాలంలో చల్లటి పదార్థాలు తినాలని, తాగాలని మనసు కోరుకుంటుంది. ముఖ్యంగా ఐస్‌క్రీమ్‌ను ఈ కాలంలో చాలా మంది ఎక్కువగా తింటారు. ఐస్‌క్రీమ్ తింటే శరీరం చల్లబడుతుంది అని చాలా మంది నమ్ముతారు. కానీ నిజంగానే ఐస్‌క్రీమ్ తింటే శరీరానికి చలవ చేస్తుందా? లేక ఇది కేవలం రుచిని మాత్రమే అందిస్తుందా నిపుణులు ఏంటున్నారో వివరంగా తెలుసుకుందాం.
మనం ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు నోటి లోపల దాని చల్లటి ఉష్ణోగ్రత వెంటనే తెలుస్తుంది. దీనివల్ల నాలుక, నోటిలోని నరాలకు చల్లదనం కలిగిన అనుభూతి కలుగుతుంది. దీని ప్రభావం మెదడుకు చేరుతుంది. మెదడు ఈ చల్లదనాన్ని శరీరమంతటా అనుభూతి చెందేలా చేస్తుంది. అందుకే ఐస్‌క్రీమ్ తినగానే మనకు చల్లగా అనిపిస్తుంది.
Read Also:Kia Seltos : కొత్త అవతారంలో రానున్న కియా సెల్టోస్.. క్రెటా, విటారాలకు భారీ షాక్
ఐస్‌క్రీమ్ నోటికి, గొంతుకు మాత్రమే చల్లదనాన్ని అందిస్తుందని మౌంట్ సెయింట్ విన్సెంట్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలోపల దాని ప్రభావం వేరేలా ఉంటుంది. వాస్తవానికి ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇవి అరగడానికి సమయం పడుతుంది. ఐస్‌క్రీమ్ చల్లదనం వల్ల శరీరంలో మెటబాలిజం (Metabolism) ప్రక్రియ కాసేపు నెమ్మదిస్తుంది. కానీ, కొద్దిసేపటికే శరీరం దానిని వేడి చేయడానికి మరింత వేగంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే, కొద్దిసేపు మీకు చల్లగా అనిపించవచ్చు, కానీ తర్వాత శరీరం ఇంకా ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది
వేసవి కాలంలో శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. చల్లటి పదార్థాలు తినడం, తాగడం వల్ల మనసుకు సాంత్వన(కంఫోర్ట్) లభిస్తుంది. అందుకే ఐస్‌క్రీమ్ డిమాండ్ పెరుగుతుంది. దీనిని ‘సెన్సరీ రిలీఫ్’ (Sensory Relief) అని పిలుస్తారు. అంటే, శరీరం లోపల నుండి ఎక్కువగా చల్లబడకపోయినా, ఐస్‌క్రీమ్ తినడం వల్ల మెదడుకు ఉపశమనం లభిస్తుంది. అందుకే మనం వేసవిలో ఐస్‌క్రీమ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం.
Read Also:Zodiac signs: నవ పంచమి ప్రభావం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే
ఎక్కువ ఐస్‌క్రీమ్ తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని, దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. అలాగే, ఎక్కువ చల్లటి పదార్థాలు తినడం వల్ల గొంతు నొప్పి , ఇన్ఫెక్షన్ లేదా జలుబు కూడా రావచ్చని తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు పరిమిత మొత్తంలోనే ఐస్‌క్రీమ్ ఇవ్వాలి. చల్లటి పదార్థాలు తినాలని అనిపిస్తే తాజా పండ్లతో తయారుచేసిన ఫ్రూట్ కుల్ఫీ లేదా ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్ మంచి ప్రత్యామ్నాయాలు. వీటిలో చక్కెర తక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి.