Ice cream : ఐస్ క్రీమ్ లో రెండు రకాలు.. ఆ రెండోది తింటే మీకు గుండె ఫెయిల్ ఖాయం
Ice cream : వేసవిలో లేదా శీతాకాలంలో మృదువైన ఐస్ క్రీంను తినడం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. అయినా దీన్ని ఎవరు ఎవరు ఇష్టపడరు? చెప్పండి. మనమందరం చల్లని, తీపి, రుచికరమైన మెత్తని ఐస్ క్రీమ్ ను ఎంతో ఇష్టంగా తింటాము. కానీ మీరు తినే సాఫ్ట్ పీనట్ పాల ఉత్పత్తి కాదని మీకు తెలుసా? ఇందులో ప్రధానంగా చక్కెరను ఉపయోగిస్తారు. గతంలోనే ఈ విషయం మీద ఓ అధ్యయనం వెలువడింది.

Ice cream : కొందరు తయారు చేసే ఐస్ క్రీమ్ లో తక్కువ కొవ్వు ఉంటుంది. అంటే 61.2 శాతం చక్కెర, 34 శాతం పాల సాలిడ్స్ లేదా స్కిమ్డ్ మిల్క్ పౌడర్, మరో 4.8 శాతం ఫ్లేవరింగ్, ఉప్పు ఉంటాయి. అయితే దీన్ని RAAR దీనిని పాల ఉత్పత్తిగా అంగీకరించడానికి నిరాకరించింది. దీనిని ‘చక్కెర ఆధారిత’ ఉత్పత్తిగా పరిగణించింది. ఈ సమాచారం కూడా ముఖ్యమైనదే. ఎందుకంటే సాఫ్టీ ఐస్ క్రీం ప్రియులు దీనిని పాల ఉత్పత్తి అని భావించి తింటున్నారు. కానీ వాస్తవానికి దాని ప్రధాన పదార్ధం చక్కెర, ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు.
నకిలీ ఐస్ క్రీం హానికరమైన ప్రభావాలు
బరువు పెరగడం : మెత్తని ఐస్ క్రీంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం. అధిక చక్కెర వినియోగం ఊబకాయాన్ని పెంచుతుంది. శరీరంలో అదనపు కొవ్వును నిల్వ చేస్తుంది.
డయాబెటిస్ ప్రమాదం : చక్కెర అధికంగా ఉండే మృదువైన ఐస్ క్రీంను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తద్వారా డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే మీరు ఐస్ క్రీమ్ ను తినేటప్పుడు అది ఎలాంటి ఐస్ క్రీమ్? అందులో ఏ పదార్థాలను ఉపయోగించారు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
దంత సమస్యలు : అధిక చక్కెర వినియోగం దంత క్షయం, ఇతర దంత సమస్యలకు కారణమవుతుంది. ఇక చల్లటి ఐస్ క్రీమ్ తిన్న వెంటనే దంతాలలో చువుక్కు మన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఏ చల్లని ఐస్ క్రీమ్ తిన్నా సరే ఈ ఫీల్ కామన్. కానీ ఇలాంటి నకిలీ ఐస్ క్రీమ్ లను తింటే దంత సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త మస్ట్.
గుండె జబ్బుల ప్రమాదం : అధిక చక్కెర వినియోగం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.
కృత్రిమ రుచుల వల్ల కలిగే నష్టాలు : నకిలీ ఐస్ క్రీంలో ఉపయోగించే రుచులు, ఏజెంట్లు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అలెర్జీలు లేదా జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
మీరు కూడా మెత్తని ఐస్ క్రీం తింటుంటే, అది ఆరోగ్యకరమని అనుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఇది చక్కెరతో తయారైన ఉత్పత్తి. మీ బరువుపై మాత్రమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Weight lose: ఈజీగా బరువు తగ్గాలంటే రాత్రిపూట ఇవి తినాల్సిందే
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Drink Milk: ఈ సమస్యలున్న వారు మిల్క్ తాగితే అంతే సంగతులు
-
Health Care : ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ వ్యాధి ఉందట..
-
Periods Problem : 16 సంవత్సరాలైన రుతుస్రావం రాలేదా? లేదా వచ్చి ఆగిపోయిందా?
-
Paneer : పనీర్ అంటే ఇష్టమా? కానీ మీరు తినవద్దు..