Face Pack: ట్యాన్‌కి చెక్ పెట్టాలంటే.. ఈ ఫేస్ ప్యాక్‌లు ఇంట్లోనే తయారు చేసుకోండిలా!

Face Pack:
వేసవిలో చర్మం నల్లగా మారుతుంది. ఎండ తీవ్రతకి చర్మంపై ముడతలు, మచ్చలు వస్తాయి. ముఖం అంతా కూడా జిడ్డుగా మారుతుంది. ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ట్యాన్ పోదు. ట్యాన్ పోవాలని చాలా మంది ఎన్నో చిట్కాలు పాటిస్తారు. వీటితో కాక బయట ఫేస్ క్రీమ్స్ వాడుతారు. కొందరు ఫేస్ ప్యాక్‌లు పెడుతుంటారు. అయితే వీటిలోని రసాయనాలు ఆ నిమిషానికి చర్మానికి అందాన్ని ఇస్తాయి. కానీ ఆ తర్వాత చర్మ సమస్యలను తీసుకొస్తుంది. వీటివల్ల ముఖంపై ఇంకా నల్లని మచ్చలు రావడంతో పాటు మొటిమలు వస్తాయి. అయితే వేసవిలో ముఖంపై ఉన్న ట్యాన్ అంతా కూడా పోయి ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని ఫేస్ మాస్క్‌లు తయారు చేసుకోవాలి. వీటిని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. చర్మం నిగనిగ లాడుతుంది. అందరిలో మీ చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది. అయితే ఇంట్లోనే ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
మీ చర్మాన్ని బట్టి ఫేస్ ప్యా్క్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోరి చర్మానికి ఒక్కోలా పనిచేస్తుంది. కొందరి చర్మానికి సహజ చిట్కాల వల్ల మొటిమలు వస్తాయి. అయితే ముఖానికి ఇంట్లో ఉన్న పదార్థాలో ఈజీగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. చందనం, వేప, గులాబీ రేకులు, కందిపప్పు వంటి వాటితో పొడి చేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌గా అప్లై చేసుకుంటే ముఖంపై ట్యాన్ అంతా కూడా పోతుంది. చాలా కాంతివంతంగా ముఖం మెరిసిపోతుంది. వీటిలోని పోషకాలు ముఖాన్ని జిడ్డుగా మార్చవు. ఫేస్‌లో ఆటోమెటిక్ గ్లోని ఇస్తుంది. వీటితో పాటు కలబంద, అవకాడో వంటి ఫేస్ ప్యా్క్‌లు అయినా ముఖానికి అప్లై చేయవచ్చు. వీటిలోని పోషకాలు ఎలాంటి మొటిమలు ముఖంపై రాకుండా చేస్తాయి. అలాగే చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే టమాటా, నిమ్మకాయలు కూడా చర్మానికి బాగా పనిచేస్తాయి. కానీ ఇవి అందరి చర్మానికి సెట్ కావు. మీ చర్మానికి ఇవి సెట్ అవుతాయని అనుకుంటే వీటితో కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి.
పసుపు, కలబంద, తేనె కలిపిన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌గా వేసుకోవాలి. వీటిని ముఖంపై అప్లై చేయడం వల్ల మచ్చలు, మొటిమలు అన్ని కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖం కాంతివంతంగా మారుతుంది. పొడి, ఆయిల్ స్కిన్ అందరికి కూడా ఇది సెట్ అవుతుంది. వీటితో పాటు గులాబీ వాటర్, ముల్తానీ మట్టి, నారింజ తొక్కల పొడి, అవకాడో, బాదం, పాలు వంటివి అప్లై చేయడం వల్ల కూడా ట్యాన్ తొలగిపోతుంది. అందరిలో మీరు యంగ్ లుక్‌లో కనిపిస్తారు. వేసవిలో ఈ ఫేస్ ప్యాక్‌లు ఎంతో బాగా ఉపయోగపడతాయి.
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Summer : సమ్మర్ లో ప్రయాణమా? ఇవి మస్ట్..
-
Watermelon: రోజూ పుచ్చకాయ తింటే ఏమవుతుందంటే?
-
Fridge : పిండి పిసికి ఫ్రిజ్ లో పెడుతున్నారా?