Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Face Pack With Coffee Power

Face Pack: ఇంట్లోనే కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్.. క్షణాల్లో అందం మీ సొంతం

Face Pack: ఇంట్లోనే కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్.. క్షణాల్లో అందం మీ సొంతం
  • Edited By: kusuma,
  • Updated on June 1, 2025 / 03:10 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Face Pack: క్షణాల్లో అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇలాంటి కెమికల్స్ ఉండే వాటిని కాకుండా ఇంట్లోనే సహజంగా తయారు ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకుని ముఖానికి అప్లై చేస్తే క్షణాల్లో అందం మీ సొంతం అవుతుంది. కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు వంటివి వస్తుంటాయి. వీటివల్ల ఉన్న అందం కూడా కొన్నిసార్లు పోతుంది. అదే మీరు సహజంగా ఇంట్లోనే ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మాత్రం ఎంతో అందంగా కనిపిస్తారు. డైలీ మనం తాగే కాఫీ పౌడర్‌తో ముఖ సౌందర్యాన్ని కొన్ని క్షణాల్లో పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఎక్కువగా ఖర్చు కూడా కాదు.. తక్కువ ఖర్చుతోనే మీరు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో మరి ఈ స్టోరీలో చూద్దాం.

పాలు
టేబుల్ స్పూన్ పాలలో కాఫీ పౌడర్‌ను కలిపి ముఖానికి ఫేస్ ప్యా్క్ వేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసిన ఒక పది లేదా పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. అలాగే యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ముసలితనం తొందరగా రాదని నిపుణులు అంటున్నారు. ఫేస్ కూడా కాంతివంతంగా మెరిసిపోతుందని చెబుతున్నారు.

ఆలివ్ ఆయిల్
ఇందులో కాస్త కాఫీ పౌడర్, పంచదార, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని కేవలం ముఖానికి మాత్రమే కాకుండా బాడీకి కూడా అప్లై చేయవచ్చు. అయితే ఈ ప్యాక్‌ను అప్లై చేసిన ఒక పదిహేను నిమిషాల తర్వాత కాస్త స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కాంతివంతంగా మెరవడం గ్యారెంటీ.

పెరుగు
కాఫీ పౌడర్‌లో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే తాజాగా కనిపిస్తుంది. దానిపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా ఈజీగా తొలగిపోతాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులోని పోషకాలు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బాదం
కాఫీ పౌడర్‌లో బాదం పేస్ట్, ఆలివ్ ఆయిల్ వేసి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేసి ముఖాన్ని కాస్త మసాజ్ చేయాలి. స్క్రబ్‌లా చేస్తే ముఖం అంతా కూడా మెరిసిపోతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా తొలగిపోతాయి. అయితే డైలీ కాకపోయినా వారానికి ఒకసారి అయినా ఇలా చేస్తే చర్మం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. కాఫీలోని పోషకాలు ముఖంపై ఉండే మృత కణాలను తొలగిస్తాయి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Khaleja Re-release : ఖలేజా సినిమాకు పాముతో వచ్చిన మహేష్ ఫ్యాన్.. ఓర్నీ ఇంత సాహసం అవసరమా ?

Tag

  • Coffee Powder
  • curd
  • Face Pack
  • Honey
  • Skin Glow
Related News
  • Curd: పెరుగులో పండ్లు కలిపి తింటే.. వామ్మో ఆరోగ్యానికి ఇంత ప్రమాదమా!

  • Lemon Juice: నిమ్మరసంలో వీటిని కలిపి తాగితే.. జీవితాంతం ఆరోగ్యం మీకే

  • Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే

  • Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు

  • Honey: తేనెతో వీటిని కలిపి తింటే శరీరంలో ఊహించని మార్పులు మీ సొంతం

  • Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us