Good Habits: కెరీర్లో ఎదగాలంటే.. ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి గుడ్ బై చెప్పాల్సిందే

Good Habits: ప్రస్తుతం చాలా మంది చెడు అలవాట్లకు ఎక్కువగా బానిస అవుతున్నారు. వీటివల్ల కెరీర్లో ఉన్నతమైన స్థానానికి వెళ్లలేకపోతున్నారు. కెరీర్ విషయంలో ఎంత కష్టపడినా కూడా అలవాట్లు అనేవి సరిగ్గా లేకపోతే మాత్రం విజయం సాధించడం కష్టమే. జీవితంలో ఉన్నతంగా విజయం సాధించాలంటే మాత్రం రోజూ వారి అలవాట్లు కూడా ముఖ్యం. అయితే కెరీర్లో ఉన్నత స్థాయిలోకి వెళ్లాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
పాజిటివ్‌గా ఉండాలి
ఏ విషయంలో అయినా కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉండాలి. కాస్త నెగిటివ్‌గా ఆలోచించినా సరే.. నిరాశ ఎదురు అవుతుంది. దీనివల్ల మీ లక్ష్యాలు చేరుకోవడానికి దూరం అవుతారు. ఏ విషయాన్న అయినా కూడా చాలా పాజిటివ్‌గా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే కెరీర్లో ఉన్నతంగా ఉంటారు. అలాగే మానసికంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు.
గాడ్జెట్లు దూరంగా ఉంచాలి
ప్రస్తుతం అందరూ కూడా ఎక్కువగా మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారు. వీటి వల్ల వాటికే సమయం ఎక్కువ వెచ్చిస్తున్నారు. దీంతో కెరీర్ విషయంలో అంత ఇంట్రెస్ట్ పెట్టలేరు. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.
బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయవద్దు
బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినరు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. చదువు విషయంలో ఇంట్రెస్ట్ పెట్టలేరు. మెదడు పనితీరు తగ్గిపోతుంది. పూర్తిగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. కాబట్టి అసలు బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయవద్దు. తప్పకుండా డైలీ తినడం అలవాటు చేసుకోండి.
అతిగా ఆలోచించవద్దు
ఎక్కువగా ఆలోచించడం వల్ల మెదడు తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది మీ రోజూ వారీ అలవాట్లపై ఎక్కువగా దెబ్బతీస్తుంది. దీంతో సమయం కూడా ఎక్కువగా వృథా అవుతుంది. అలాగే ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. చివరకు డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అతిగా ఆలోచించవద్దు.
ఒకే చోట కూర్చోవద్దు
బాడీకి విశ్రాంతితో పాటు శారీరక శ్రమ కూడా ఉండాలి. ఒకే చోట ఎక్కువగా కూర్చోవద్దు. దీనివల్ల మీ బాడీకి శ్రమ లేకపోవడం వల్ల మీరు సరిగ్గా వర్క్ చేయలేరు. బాడీకి విశ్రాంతి లేకపోతే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకే చోట ఎక్కువగా కూర్చోకుండా వ్యాయామం, యోగా వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు.
విమర్శలు స్వీకరించాలి
ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నామంటే సపోర్ట్ చేసే వాళ్ల కంటే విమర్శించే వాళ్ల సంఖ్య పెరిగిపోతుంది. ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా వాటిని అంగీకరించే గుండె ధైర్యం ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న వాటిని సాధిస్తారు.