Telangana: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లు ప్రారంభం.. వీటికి దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే?

Telangana:
తెలంగాణ ప్రభుత్వం పోలీసు పిల్లలకు, ఇతర యూనిఫాం సర్వీస్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది పిల్లలకు మంచి విద్యను అందించడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ పాఠాలతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, క్రీడలు, సామాజిక స్పృహ, ఉన్నత విలువలను పెంపొందించే విధంగా ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి జాయిన్ కావడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతిలో చేరడానికి అవకాశాలు కల్పిస్తోంది. దాదాపు 50 శాతం పోలీస్ కుటుంబాలు పిల్లలకు ఈ స్కూల్‌లో అవకాశం కల్పిస్తోంది. మిగిలిన సీట్లు అన్ని కూడా ఇతరులకు కేటాయించనుంది. ఈ సీట్ల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా 90591 96161 నంబర్‌కి సంప్రదించవచ్చు. అలాగే వీటికి అప్లై చేయాలంటే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేయాలి.
కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్‌లోని రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో గతేడాది పోలీస్ డ్యూటీ మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగారెడ్డిలో శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 5 వ తరగతి వారికి పాఠశాల ప్రారంభమవుతుంది. ఇలా ఒక్కో ఏడాదిని పెంచుకుంటూ.. డిగ్రీ వరకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్, ఫైర్, ఎస్‌పీఎఫ్ ఉద్యోగుల పిల్లలు అందరూ కూడా ఇక్కడ విద్యనభ్యసించనున్నారు. ప్రపంచ స్థాయిలో ఉండే ప్రమాణాలతో విద్యను అందించాలని ప్లాన్ చేస్తున్నారు. వీటికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు
-
Uric Acid: యూరిక్ యాసిడ్ ఇబ్బంది పెడుతుందా.. ఈ ఫుడ్స్ తీసుకోండి
-
Syllabus: సోషల్ సైన్స్, బి.ఏ ఆర్ట్స్ సిలబస్‌లో మార్పులు.. ఎప్పటి నుంచి అమలు కానున్నాయంటే..!
-
Delhi IIT: జేఈఈ రాయకుండానే.. ఐఐటీ ఢిల్లీలో కోర్సు జాయిన్.. ఎలాగంటే?
-
Good Habits: కెరీర్లో ఎదగాలంటే.. ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి గుడ్ బై చెప్పాల్సిందే