Delhi IIT: జేఈఈ రాయకుండానే.. ఐఐటీ ఢిల్లీలో కోర్సు జాయిన్.. ఎలాగంటే?

Delhi IIT: చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు. అయితే ఇంజనీరింగ్ చేయాలనే చాలా మంది విద్యార్థులు ముందుగా ఐఐటీలో జాయిన్ కావాలని కలలు కంటారు. ఐఐటీలో అడ్మిషన్ పొందడం కూడా చాలా కష్టం. చాలా మంది విద్యార్థులు కష్టపడి వీటికి చదువుతుంటారు. ఐఐటీలో సీటు పొందాలంటే తప్పకుండా జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వా్న్స్డ్లో మంచి మార్కులు రావాలి. అప్పుడే ఐఐటీలో సీటు సంపాదిస్తారు. అయితే ఈ పరీక్షలు లేకుండా కూడా కొన్ని కోర్సుల్లో ఈజీగా అడ్మిషన్ పొందవచ్చు. దేశంలో ఎన్నో ఐఐటీ కాలేజీలు ఉన్నాయి. ఇవి కొన్ని ప్రోగ్రామ్‌లను అందిస్తాయి. ఢిల్లీ ఐఐటీలో కొన్ని కోర్సులు ఉన్నాయి. వీటిలో జాయిన్ కావాలంటే జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా కూడా జాయిన్ కావచ్చు. మరి జేఈఈలో ఉత్తీర్ణత సాధించకుండా ఢిల్లీ ఐఐటీలో ఏయే కోర్సులు చేయవచ్చు. వీటికి ఫీజు ఎంత ఉంటుంది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
ప్రస్తుతం అంతా టెక్నాలజీ మారిపోయింది. దీంతో జేఈఈ స్కోర్ లేకుండా కూడా కొన్ని ఐఐటీలు మంచి కోర్సులను ఇస్తున్నాయి. ఢిల్లీ ఐఐటీ ఎక్కువగా స్కిల్స్ డిమాండ్, రోబోటిక్స్, ఏఏఐ, డేటా సైన్స్, యూఎక్స్ డిజైన్, ప్రొడక్ట్ మేనేజర్, ఏఏఆర్, వీఆర్‌లో ప్రత్యేక సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. అయితే వారాంతం లేదా సాయంత్రం వేళలో తరగతులను నిర్వహిస్తోంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ రోబోటిక్స్ కోర్సు మొత్తం 5 నెలల ఉంటుంది. ఇది మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వారాంతంలో 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్లాస్‌లు చెబుతుంటారు. అయితే వీటికి ఫీజు రూ.1,69,000తో పాటు ట్యాక్స్ కూడా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్, రీసెర్చ్ డెవలప్మెంట్ వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సంబంధిత రంగాలలోని వారు ఈ కోర్సు చేయవచ్చు.
అడ్వాన్స్ డ్ సర్టిఫికేట్ ఇన్ యూఎక్స్ స్ట్రాటజీ కోర్సు మార్చి 16న స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు మొత్తం పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పడుతుంది. మంగళవారం, గురువారం మాత్రమే రాత్రి 8 గంటల నుంచి 9:30 గంటల వరకు) ఉంటుంది. దీని ఫీజు రూ.1,70,000తో పాటు ట్యాక్స్ కూడా ఉంటుంది. అలాగే అప్లైడ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు కూడా ఆరు నెలలు ఉంటుంది. దీన్ని కేవలం ఆదివారం మాత్రమే ఉంటుంది. ఫీజు రూ.1,69,000తో పాటు ట్యాక్స్ కూడా ఉంటుంది. డేటా సైన్స్‌లో అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ కోర్సు 8 నెలలు ఉంటుంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ వారు ఎక్కువగా ఈ కోర్సు చేస్తుంటారు. దీని ఫీజు రూ.1,89,000తో పాటు ట్యాక్స్ కూడా ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ థింకింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఆరు నెలలు ఉంటుంది. ఈ కోర్సు ఫీజు రూ.1,50,000 ఉంటుంది. సర్టిఫికెట్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ కోర్సు ఫీజు రూ.1,69,000తో పాటు ట్యాక్స్ ఉంటుంది.