Hair Health: మీ జుట్టు బూడిద రంగులోకి మారిందా? వీటిని తింటే అసలు రంగే మారదు.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక రకాల సమస్యలను కలిగిస్తున్నాయి. ఈ అలవాట్ల వల్ల జుట్టు రంగు మారుతుంది.

Hair Health:
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అనేక రకాల సమస్యలను కలిగిస్తున్నాయి. ఈ అలవాట్ల వల్ల జుట్టు రంగు మారుతుంది. కొన్ని సార్లు బూడిద రంగు వచ్చేస్తుంది. ఇలా జరిగితే చాలా మంది బాధ పడతారు. అరె నా జుట్టు ఇలా మారిపోయింది ఏంటి అంటూ చాలా మంది బాధ పడుతుంటారు. మరి దీనికి సెల్యూషన్ లేదా అనుకుంటున్నారా? కానీ ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. సో ఈ సొల్యూషన్ కి కూడా ఉంటుంది. అదేంటంటే? మీ ఆహారంలో కొన్ని సూపర్‌ఫుడ్‌లను చేర్చుకోండి. అవి మీ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిగా చేస్తాయి. సో జుట్టుకు వచ్చే ఆ బూడిద రంగు కూడా తగ్గుతుంది.
బెర్రీలు
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్ లు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఇది కూడా బూడిద రంగుకు ప్రధాన కారణం. వాటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరం. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్‌ను పరిమిత పరిమాణంలో తీసుకుంటే , చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. డార్క్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రాగి కూడా ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఆకు కూరలు
పాలకూర, కాలే వంటి ఆకు కూరలలో విటమిన్లు (ఎ, సి, ఇ), ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. మెలనిన్ ఉత్పత్తికి అవసరం.
గుడ్లు
గుడ్లు పోషకాలకు శక్తివంతమైన వనరులు. ఇది ప్రోటీన్, బయోటిన్, విటమిన్ B12 లను కలిగి ఉంటుంది. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి, తెల్లబడకుండా చేస్తుంది.
గింజలు – విత్తనాలు
బాదం, వాల్నట్లు, అవిసె గింజలు, చియా గింజలు బయోటిన్, జింక్, ఇతర పోషకాల అద్భుతమైన వనరులుగా చెబుతుంటారు. ఇవి జుట్టును బలంగా చేస్తాయి. తెల్లగా మారదు జుట్టు.
కొవ్వు చేప: సాల్మన్, మాకేరెల్, సార్డిన్లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రంగు మారనివ్వవు.
చిలగడదుంపలు – క్యారెట్లు: ఈ శక్తివంతమైన కూరగాయలలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన తలను అంటే తల స్కిన్ ను కాపాడుతుంది. జుట్టు కోసం సెబమ్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
పప్పులు: కాయధాన్యాలు, బీన్స్ ప్రోటీన్, ఇనుము, జింక్ కు అద్భుతమైన వనరులు. సో వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
పులియబెట్టిన ఆహారాలు
కిమ్చి, సౌర్‌క్రాట్, పెరుగులలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే బయోటిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం
-
Hair Health Tips: పదే పదే గుండు చేయిస్తే వెంట్రుకలు మందంగా వస్తాయా?
-
Rosemary Oil: తలకు రోజ్మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?
-
Hair Health Tips: నీరు మారితే జుట్టు ఊడిపోతుందా? మరి చుట్టాల ఇంటికి, స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి?
-
Hair: చికెన్‌కి, జుట్టుకి లింక్ ఏంటి.. దీనివల్ల జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?
-
Hair Health: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జుట్టు రాలడాన్ని ఆపడం కష్టమే..