Health Issues: ఈ ఆకుని నీటిలో మరిగించి తీసుకుంటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

Health Issues:
తమలపాకులను పూజల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం, పూజ ఉన్నా సరే తప్పకుండా తమలపాకులు ఉండాల్సిందే. ముఖ్యంగా ముత్తైదువులకు తమలపాకులను ఇస్తుంటారు. మరికొందరు వీటిని కిల్లీగా ఉపయోగిస్తుంటారు. భోజనం చేసిన తర్వాత కిల్లీ తినడం వల్ల ఫుడ్ జీర్ణం అవుతుందని చాలా మంది తింటారు. అయితే ఈ తమలపాకును పూజలు, కిల్లీకే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తమలపాకులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని అనారోగ్య సమస్యలకు వాడుతారు. ముఖ్యంగా ఆయుర్వేదిక్ మందుల తయారీకి కూడా వాడుతారట. అయితే తమలపాకు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటనే విషయాలు మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.
తమలపాకులను నమలడం వల్ల శరీరంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు నయం అవుతాయి. వీటిని డైరెక్ట్‌గా నమలలేని వాళ్లు. గ్లాసు నీటిలో కొన్ని తమలపాకులు వేసి నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించాలి. ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. అలాగే ఇవి నోటి దుర్వాసనను నయం చేస్తాయి. కొందరు ఎంత నీట్‌గా బ్రష్ చేసినా కూడా నోరు దుర్వాసన వస్తుంది. అలాంటి వారికి ఈ తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. అలాగే చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్‌ని కూడా తమలపాకులు ఆపుతాయి. వీటిలోని పోషకాలు దంతాల సమస్య రాకుండా చేయడంతో పాటు అవి బలంగా ఉండేలా చేస్తాయి. కొందరికి చర్మంపై అలర్జీ, దురద వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారు తమలపాకులను వాడితే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. తమళపాకుల్లో ఎక్కువగా యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి.
కొందరు బాలింతలకు పాలు ఉత్పత్తి కావు. ఇలాంటి వారు తమలపాకులను కాస్త వేడి చేసి ఛాతీపై ఉంచితే పాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే గాయాలు మానడానికి కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. తమలపాకుల రసాన్ని గాయంపై వేస్తే తొందరగా నయం అవుతుంది. అలాగే ఈ రసాన్ని తాగినా కూడా జీర్ణ సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి ఈ నీటిని తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకుల వల్ల గుండెలో మంట, ఛాతీలో నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే లేదా సాయంత్రం వేళలో ఈ తమలపాకుల రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ తమలపాకులను కేవలం పూజలకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగించండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Weight Loss: ఒక నెలలో ఎంత బరువు తగ్గాలి? ఏది మంచిది?
-
Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..
-
Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?
-
Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్
-
Betel Leaves : భోజనం చేశాక తమలపాకులు నమిలితే ఇన్ని ప్రయోజనాలా?