Heart Attack: మీకు గుండె పోటు వచ్చే నెల రోజుల ముందు నుంచే ఈ 8 సంకేతాలు ఉంటాయి.. అవేంటంటే?

Heart Attack:
ప్రస్తుతం చాలా మందికి గుండె పోటు వస్తుంది. ఎవరికి ఎప్పుడు వస్తుందో ఊహించడం కూడా కష్టమే. చాలా మంది ఈ సమస్యతో మరణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ గుండెపోటు గురించి ఓ వాస్తవం తెలుసుకుందాం. గుండెపోటు అకస్మాత్తుగా రాదంటే మీరు నమ్ముతారా? అవును నిజమే శరీరం నెలల ముందుగానే దాని సంకేతాలను ఇస్తుందట. కానీ ఈ సంకేతాలను చాలా మంది అర్థం చేసుకోలేక గుర్తించడం లేదు. కానీ ఈ లక్షణాలను మాత్రం అర్థం చేసుకుంటే కచ్చితంగా గుండె పోటు నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ సంకేతాలు ఏంటంటే?
ఛాతీలో తేలికపాటి నొప్పి లేదా భారంగా అనిపించడం
ఛాతీలో తేలికపాటి నొప్పి, బరువు, మంట లేదా ఒత్తిడిని పదే పదే వస్తుంటే అసలు లైట్ తీసుకోవద్దు. గుండెపోటుకు ముందు, గుండె ధమనులు క్రమంగా మూసుకుపోతాయి. ధీంతో ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది. ఈ నొప్పి కొన్నిసార్లు భుజాలు, దవడ, గొంతు, వీపు వరకు వ్యాపిస్తుంది. మీకు ఈ లక్షణాలు అనిపిస్తే, వెంటనే ECG లేదా ఇతర గుండె పరీక్ష చేయించుకోండి.
అలసట – బలహీనత: ఏ పని చేయకుండా కూడా మీకు డల్ గా అనిపిస్తుందా? అంటే శరీరం అలసటగా ఉందా? ఇక ఉదయం నిద్రలేచిన వెంటనే బలహీనంగా ఉంటున్నారా? అయితే, మీ హృదయంలో బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె శరీరంలోని ఇతర భాగాలకు తగినంత మొత్తంలో ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని సరఫరా చేయకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య అలాగే ఉంటే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: కాస్త నడిచినా, మెట్లు ఎక్కినా లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, మీరు గుండె సమస్యతో బాధ పడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోతే, ఊపిరితిత్తులలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల శ్వాస ఆడదు. ఈ సమస్య పెరుగుతుంటే, దానిని అసలు లైట్ తీసుకోవద్దు.
నిద్ర- అశాంతి అనుభూతి
రాత్రి ప్రతి సారి మెలుకువ వస్తుందా? ఎటువంటి కారణం లేకుండా విశ్రాంతి ఉండటం లేదా? అకస్మాత్తుగా భయపడుతున్నారా? అది గుండెపోటుకు ముందస్తు సూచన కావచ్చు. చాలా మంది దీనిని ఒత్తిడి అనుకుంటారు. కానీ గుండె ఇది గుండె ధమనులు ఇరుకుగా మారడానికి సంకేతం కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు.
అధికంగా చెమట పట్టడం
చలిలో లేదా సాధారణ వాతావరణంలో కూడా మీకు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా? అది గుండెపోటుకు ముఖ్యమైన సంకేతం కావచ్చు. గుండె రక్తాన్ని పంప్ చేయడంలో ఇబ్బంది పడినప్పుడు, శరీరం దానిని సరిచేయడానికి కష్టపడి పనిచేస్తుంది. దీనివల్ల ఎక్కువ చెమట పడుతుంది. మీరు చల్లని ప్రదేశంలో ఉండి కూడా చెమటలు పడుతుంటే, దానిని అస్సలు లైట్ తీసుకోవద్దు.
పై శరీరంలో నొప్పి
మీ భుజాలు, మెడ, దవడ లేదా వీపులో కాస్త నొప్పిగా అనిపిస్తుందా? అవును అయితే, అది గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. గుండెపోటుకు ముందు, శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని కారణంగా చాలాసార్లు శరీరం పై భాగంలో నొప్పి అనుభూతి ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా ఈ నొప్పి పదే పదే వస్తుంటే కాస్త ఆలోచించాల్సిందే.
తలతిరగడం
తల తిరుగుతున్నట్లు అనిపించినా, లేచిన వెంటనే చీకటిగా అనిపించినా గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె శరీరంలోని అన్ని భాగాలకు సరిగ్గా రక్తాన్ని సరఫరా చేయలేనప్పుడు, మెదడుకు కూడా ఆక్సిజన్ లేకపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల తలతిరుగుతుంది.
అజీర్ణం, కడుపు నొప్పి, వాంతులు వచ్చినట్లు అనిపించడం
ఈ రీజన్ చదివి షాక్ అయ్యారా? కానీ గుండెపోటుకు ముందు కొంతమందికి గ్యాస్, అజీర్ణం, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయట. ముఖ్యంగా గుండెపోటుకు ముందు మహిళల్లో ఇటువంటి సమస్యలు కనిపిస్తాయి. మీకు ఎటువంటి కారణం లేకుండా అజీర్ణం లేదా కడుపులో భారంగా అనిపిస్తే కాస్త అనుమానించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
-
Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
-
Heart Attack : పురుషుల కంటే భిన్నంగా మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. నిర్లక్ష్యం చేశారో అంతే
-
Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి
-
BTB Juice: ఏబీసీ కాదు.. ఈ జ్యూస్ తాగితే సర్వ రోగాలు పరార్