Heart Health: కేవలం నడవడం కాదు.. ఇలా నడిస్తే మీ గుండెకు ఇక నో టెన్షన్..

Heart Health: గుండె అనే పేరు వింటేనే గుండె పేలిపోయినంత టెన్షన్ అవుతుంది కదా. ఎవరికి ఎప్పుడు ఎలా గుండె పోటు వస్తుందో? ఏ గుండె సమస్య ఉందని తెలుస్తుందో అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి గుండె పోటు బారిన పడుతున్నారు. రాత్రి మాట్లాడిన వ్యక్తి ఉదయం గుండె పోటుతో మరణించారు అనే వార్తలు ఎన్నో వింటున్నాం. ఉన్నట్టుండి స్కూల్స్ లో పాఠాలు చెబుతూ, డ్యాన్స్ చేస్తూ, వ్యాయామాలు చేస్తూ కూడా ఈ గుండె పోటు వల్ల కుప్పకూలి పోతున్నారు. అందుకే గుండె పేరు ఎత్తగానే హడలి పోయే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఇక యువతలో గుండెపోటు, గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బిజీ జీవితం, సరైన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవన శైలి కారణంగా, గుండె జబ్బుల ప్రమాదం రోజు రోజుకు పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. జస్ట్ వాకింగ్ సరిపోతుందట.
కానీ నార్మల్ వాకింగ్ కాదండోయ్. వేగంగా నడవాలట. ప్రతి రోజు ఉదయం 30 ని.లు నడిస్తే చాలు. అది కూడా కాస్త వేగంగా నడిస్తే ఈ గుండె సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక వాకింగ్ అందరూ చేయవచ్చు. కానీ నార్మల్ గా చేసే వారి కంటే స్పీడ్ గా వాక్ చేసే వారిలో ఈ గుండె సమస్యలు తక్కువగా ఉన్నట్టు చెబుతున్నాయి అధ్యయనాలు. అయితే ఈ వేగంగా నడవడం బలానికి కొలమానమట. గుండెకు మాత్రమే కాదండోయ్ వేగంగా నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
రోజంతా ఒకే చోట కూర్చొంటే కూడా గుండెపై చెడు ప్రభావం పడుతుందట. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అయినా అలవాటు చేసుకోవాలి. ఇక పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. పాలకూర, బ్రోకలీ, క్యారెట్లు, టమోటాలు, బెర్రీలు, సిట్రస్ పండ్లు గుండెకు చాలా ప్రయోజనకరం.
ఇక బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, బార్లీ, తృణధాన్యాల గోధుమలు ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అన్ని రకాల కొవ్వు శరీరానికి హానికరం కాదు. ఆలివ్ నూనె, గింజలు, నట్స్, అవకాడోలు, చేపలలో లభించే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Coconut water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు అధికంగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Maha Shivaratri: శివుడికి ఇష్టమైన ఆకులు ఇవే.. వీటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
-
Heart Attack: మీకు గుండె పోటు వచ్చే నెల రోజుల ముందు నుంచే ఈ 8 సంకేతాలు ఉంటాయి.. అవేంటంటే?
-
Weight Loss: ఈ మసాలా దినుసులతో ఈజీగా వెయిట్ లాస్.. డైలీ తీసుకుంటే సన్నని నడుము మీ సొంతం
-
Kharbuja seeds: వచ్చేసిన సమ్మర్.. ఈ గింజలు తీసుకుంటే ట్రిపుల్ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం