Water Diet: వాటర్ డైట్ ఎంత ప్రమాదమో తెలిస్తే.. జన్మలో దరిదాపుల్లోకి వెళ్లరు

Water Diet: కాస్త బొద్దుగా ఉంటే చాలు.. బరువుగా ఉన్నామని ఫీల్ అయ్యి తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందులోనూ ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దీంతో యూట్యూబ్‌లో చూసి చాలా మంది డైట్ ఫాలో అవుతున్నారు. కనీసం డాక్టర్ల సలహా కూడా తీసుకోకుండా పాటిస్తున్నారు. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటన కేరళలో ఇటీవల జరిగింది. బరువు తగ్గాలని వాటర్ డైట్ చేసి ఓ యువతి చివరకు ప్రాణాలు కోల్పోయింది. కేవలం వాటర్ తాగుతూనే ఆరు నెలల పాటు జీవించింది. దీంతో సమస్య తీవ్రమై ఆమె లేవలేని స్థితికి చేరింది. ఆ తర్వాత కొన్ని రోజులు ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయినంత వరకు కూడా వాటర్ డైట్ పాటించినట్లు తల్లిదండ్రులకు తెలియదు. ఆ యువతి మరణించడంతో ప్రస్తుతం వాటర్ డైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ వాటర్ డైట్ అంటే ఏంటి? నిజంగానే ఈ డైట్‌తో బరువు తగ్గుతారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి వాటర్ డైట్ బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఒక 12 మందిపై అధ్యయనం చేసి దీనిపై శాస్త్రవేత్తలు తెలిపారు. వాటర్ డైట్ వల్ల శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. వాటర్ డైట్ అంటే కేవలం వాటర్ తాగి మాత్రమే జీవిస్తారు. ఈ వాటర్ డైట్ పాటించిన తర్వాత కేవలం 12 రోజుల్లో ఈజీగా 5.7 కిలోల బరువు తగ్గారు. ఆ తర్వాత మళ్లీ అన్నం తిన్నా కూడా బరువు పెరగలేదు. అయితే దీన్ని సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వాటర్ డైట్ అనేది కొందరు ఒక రోజు పాటిస్తే మరికొందరు ఎక్కువ రోజులు పాటిస్తారు. ఒకటి లేదా రెండు రోజులు ఉండటం వల్ల శరీరంలోని కొవ్వు అంతా కరుగుతుంది. ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే శరీరంలోని అన్ని మలినాలను కూడా తొలగిస్తుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను ఆరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పూర్తిగా ఏం తీసుకోకుండా కేవలం వాటర్ తాగుతూ ఉంటే మాత్రం నీరసం వస్తుంది. మరీ నీరసంగా మీకు అనిపిస్తే మాత్రం ఈ డైట్ పాటించకపోవడం మంచిది.
ఈ వాటర్ డైట్‌ను ఆరోగ్యంగా ఉన్నవారే పాటించాలి. తక్కువ బరువు ఉన్నవారు, గుండె సమస్యలు, టైప్ 1 డయాబెటిస్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అసలు చేయకూడదు. అలాగే మైగ్రేషన్ ఉన్నవారు కూడా ఈ ఫాస్టింగ్ చేయవద్దన నిపుణులు చెబుతున్నారు. కొందరు రక్తదానం చేసి ఉంటారు. అలాంటి వారు కూడా వాటర్ డైట్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల వరకు ఉపవాసం ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ రోజులు ఉంటే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువ రోజులు ఈ డైట్ పాటించవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Weight Loss: ఒక నెలలో ఎంత బరువు తగ్గాలి? ఏది మంచిది?
-
Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..
-
Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?
-
Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్
-
Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు