Kharbuja seeds: వచ్చేసిన సమ్మర్.. ఈ గింజలు తీసుకుంటే ట్రిపుల్ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
వేసవి కాలం వచ్చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా ఏప్రిల్, మే వస్తే ఎలా ఉంటుందో చెప్పలేం.

Kharbuja seeds:
వేసవి కాలం వచ్చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా ఏప్రిల్, మే వస్తే ఎలా ఉంటుందో చెప్పలేం. అయితే వేసవిలో బాడీ బాగా వేడి చేయడంతో పాటు నీరసంగా ఉంటారు. ఎందుకంటే ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా మంది నీరసంగా తయారు అవుతారు. అయితే వేసవిలో ఆరోగ్యంగా, ఎనర్జీటిక్‌గా ఉండాలని చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. అందరూ ఎక్కువగా ఖర్బూజ పండు జ్యూస్‌ను తాగుతారు. ఈ జ్యూస్‌ను వేసవిలో తాగడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. అలాగే శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది. కొందరు కేవలం జ్యూస్ మాత్రమే తాగకుండా
ఖర్బూజను కూడా తింటుంటారు. తినడానికి పెద్ద టేస్ట్ అనిపించదు. కానీ ఆరోగ్యపరంగా తింటుంటారు. అయితే చాలా మంది వీటిని తినేప్పుడు అందులోని గింజలను పడేస్తుంటారు. ఈ గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయని, వీటిని తింటే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సీడ్స్‌లో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే ఈ గింజలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
బీపీ
ఈ ఖర్బూజ పండు, గింజలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులోని పొటాషియం బీపీని కంట్రోల్ చేయడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి
వీటిని డైలీ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే శరీరంలోని అన్ని టాక్సిన్లను ఈ గింజలు బయటకు పంపుతాయి. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను దూరం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
చర్మ ఆరోగ్యం
ఈ పండును, గింజలను డైలీ తినడం వల్ల ముడతలు తగ్గుతాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించడంతో పాటు యంగ్‌గా ఉండేలా చేస్తుంది.
కళ్లు ఆరోగ్యంగా..
ఈ పండును తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. వీటిలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
ఒత్తిడి నుంచి విముక్తి
ఈ పండు లేదా గింజలను తినడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నిద్రలేమి వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయి.
గుండె ఆరోగ్యం
ఇందులోని ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎలాంటి గుండె జబ్బులు రాకుండా సాయం చేస్తాయి.
మలబద్ధకం
ఈ సీడ్స్‌ను తినడం వల్ల మలబద్ధకం సమస్య క్లియర్ అవుతుంది. అలాగే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు కూడా క్లియర్ అవుతాయి.
-
Mental Stress : యువతకు పెరుగుతున్న మానసిక ఒత్తిడి.. దేశ భవిష్యత్తుకు ప్రమాదమా?
-
Heart Health : గుండెకు ముప్పు తెస్తున్న మూడు ఆధునిక అలవాట్లు ఇవే.. డాక్టర్లు ఏమంటున్నారంటే ?
-
Cardiac Arrest : హార్ట్ ఎటాక్ కంటే కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరమా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?
-
premature aging in men : అబ్బాయిలు ఈ మిస్టేక్స్ చేశారో.. వృద్ధాప్యం గ్యారెంటీ
-
Kidney Problems : రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్తున్నారా? అయితే ఈ వ్యాధి సంకేతాలు కావొచ్చు
-
Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి