Life Style: ఇతరుల కోసం మాటా మాటా అనుకుని.. సొంత బంధుత్వాలనే దూరం పెడుతున్న జనం

Life Style:
బంధుత్వాల కోసం ఇతరులను కంటే.. ఇతరుల కోసం బంధుత్వాలనే వదిలేస్తున్న రోజులివి. సొంత అమ్మ నాన్న కంటే.. హీరో, హీరోయిన్లకి ఫ్యాన్స్ అవుతున్నారు. మా తల్లిదండ్రులు గొప్ప అని చెప్పుకోకుండా.. నా హీరోనే గొప్ప, తననే తిడతారా? అని గొడవలు పడుతున్నారు. ఇష్టమైన రాజకీయ నాయకుడు, క్రికెటర్, సినిమా హీరో, సెలబ్రిటీ ఇలా వారిని మాటలు అంటారా? అని సొంత బంధువులను దూరం పెడుతున్న రోజుల్లో మనమంతా బతుకుతున్నాం. పుట్టిన రోజు అయితే వాట్సాప్ స్టేటస్ పెట్టలేదని, డబ్బులు అడిగితే ఇవ్వలేదని, తనకి పడని వాళ్లతో మాట్లాడారని ఇలా ఏవేవో కారణాలతో స్నేహితులు, చుట్టాలను దూరం పెడుతున్నారు. కలిసి ఉండటానికి కారణాలు వెతకకుండా.. విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారు. దీనంతటికి ముఖ్య కారణం ఈగో. వాళ్లతో నాకు పనేంటని ఈగోతో సొంత బంధువులను దూరం పెడుతున్నారు. మనస్సులో తప్పు చేస్తున్నామని వాళ్లకి అనిపించినా కూడా బయటకు ఒప్పుకోరు. సొంత బంధువులతో ఏ చిన్న గొడవ వస్తే చాలు.. ఇక వారితో సంబంధం లేదు. జన్మలో మాట్లాడమని చెబుతుంటారు. అంతా మనవాళ్లే కదా అని అసలు కూడా తగ్గరు. పోనీ అవతలి వాళ్లు తగ్గి దగ్గరకు వచ్చినా కూడా అహం చూపిస్తారు. తప్పు అంతా మీ సైడ్ ఉండి.. మళ్లీ వారు తగ్గి సారీ చెప్పినా కూడా పట్టించుకోరు. ఈగో వల్ల కలవాలని ఉన్నా కూడా కలవరు.
ఇలా దూరం రోజుల నుంచి పెరిగి సంవత్సరాలకు చేరుతుంది. ఈగో వల్ల మనుషులను కలవాలని ప్రయత్నించరు. అవకాశం వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోరు. కష్టమైదేనా వస్తే బంధువులు, కుటుంబ సభ్యులే అండగా ఉంటారు. కానీ ఇతరులు ఎవరూ కూడా రారు. కాబట్టి ఇతరుల కోసం సొంత వాళ్లను దూరం చేసుకోవద్దు. ఎన్ని గొడవలు వచ్చినా కూడా మళ్లీ కలిసిపోండి. పాత గొడవలను తీస్తూ ఉంటే.. పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని అలాగే ఉంచేసి.. మళ్లీ మంచిగా కుటుంబ సభ్యులతో ఉండండి. ఏ బంధమైనా విడిపోయిన తర్వాత మళ్లీ కలవాలంటే కష్టమే. కాస్త సమయం పడుతుంది. కాబట్టి మీరు కూడా మన కుటుంబ సభ్యులే కదా అని ఆలోచించండి. అంతే కానీ అతిగా ఆలోచించి ఈగోకి పోయి సొంత మనుషులను దూరం చేసుకోవద్దు. ఈ రోజుల్లో సొంత కుటుంబాల కంటే ఇతరులకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. వారు అవసరానికి వాడుకుని, మధ్యలో వదిలేస్తున్నారు. ఇలాంటి వాళ్ల కోసం మీరు కరెక్ట్ మనుషులను వదిలేయవద్దని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సొంత వాళ్లను ఎప్పుడూ కూడా దూరం పెట్టవద్దు.