Summer Drinks: సమ్మర్‌లో తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు.. తాగితే సమస్యలన్నీ మటుమాయం

Summer Drinks: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక చాలా మంది జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటివి తాగుతుంటారు. అయితే వేసవిలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తప్పకుండా జ్యూస్‌లు తాగాలి. సమ్మర్‌లో పండ్ల జ్యూస్‌లు తాగితే.. బాడీ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. అయితే సాఫ్ట్ డ్రింక్‌లు వంటివి తాగడం బదులు.. పండ్ల జ్యూస్‌లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్నే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. వడదెబ్బ నుంచి కూడా ఈ పండ్ల రసాలు కాపాడతాయి. పండ్లలోని ఫైబర్, ఎలక్ట్రోలైట్లు వేసవిలో బాడీని చల్లగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పండ్ల రసాలు తాగితే అన్ని అనారోగ్య సమస్యలు కూడా పరార్ అవుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఈస్టోరీలో చూద్దాం.
పుచ్చకాయ జ్యూస్
ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది. వేసవిలో పుచ్చకాయను తినడం లేదా జ్యూస్ చేసి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మీ శరీరానికి తక్షణమే శక్తి కూడా లభిస్తుంది. తప్పుకుండా వేసవిలో పుచ్చకాయ జ్యూస్‌ను తీసుకోండి. దీని ధర కూడా తక్కువ రేటుకే లభిస్తుంది.
నారింజ రసం
ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నారింజ పండ్లలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. నారింజ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైనాపిల్ జ్యూస్
పైనాపిల్‌లో శరీరానికి శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం ఉంటుంది. బాడీ డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చేస్తుంది. వేసవిలో పైనాపిల్ జ్యూస్, లేదా పైనాపిల్ తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలోని వేడిని ఈజీగా తగ్గిస్తుంది.
మామిడి రసం
మామిడి జ్యూస్ వేసవిలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ సమయంలో మామిడి జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలనీర్
వేసవిలో ఇలనీర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది.
బెర్రీ జ్యూస్
ద్రాక్ష, స్ట్రాబెర్రీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర వేడిని తగ్గించడంతో పాటు ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో ఈ జ్యూస్‌లు తాగితే ట్యాన్ నుంచి కూడా కాస్త విముక్తి కలుగుతుంది. బాడీ వేడికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
-
Summer Health Tips: వేసవిలో వీటిని తీసుకోండి శరీరం చల్లగా ఉంటుంది.
-
Summer: వేసవిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోండిలా!
-
Summer : సమ్మర్ లో ప్రయాణమా? ఇవి మస్ట్..
-
Summer Health Tips: ఎండాకాలం మొదలైంది. ఉప్పు నీరు తాగుతున్నారా?
-
Summer Health Tips: ఎండాకాలంలో వచ్చే వ్యాధులు, లక్షణాలు.. తస్మాత్ జాగ్రత్త
-
Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.