Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత ఈజీగా వెయిట్ లాస్ కావడం ఎలా? హీరోయిన్ల సీక్రెట్ ఇదేనా

Pregnancy:
మహిళల శరీరంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. వయస్సు పెరిగే కొలది వారి శరీరంలో చెప్పలేనన్ని మార్పులు అనేవి సహజం. అయితే మహిళలు గర్భం దాల్చిన తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. బాడీ ఆకృతి పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఎక్కువగా బరువు పెరుగుతారు. సాధారణ సమయాల్లో బరువు తగ్గడం పర్లేదు. కానీ డెలివరీ తర్వాత బరువు తగ్గడం అనేది చాలా కష్టం. మహిళలకు ఇది పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఈ రోజుల్లో చాలా మంది డెలివరీ తర్వాత బాగా బరువు పెరుగుతున్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డెలివరీ తర్వాత ఇవే కాకుండా మానసిక సమస్యలు, ఒత్తిడికి కూడా కొందరు అమ్మాయిలు గురి అవుతుంటారు. అయితే సాధారణ వారితో పోలిస్తే.. హీరోయిన్లు డెలివరీ తర్వాత చాలా ఈజీగా బరువు తగ్గుతారు. అసలు దీనికి వారు పాటించే సీక్సెట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
హీరోయిన్లు డెలివరీ తర్వాత బరువు తగ్గడం వెనుక వారి కష్టం ఉంది. వీరు వైద్య నిపుణులు సలహా మేరకు నియమాలు పాటిస్తారు. ఈ క్రమంలో డెలివరీ తర్వాత కష్టంగా ఉండటం వల్ల కొందరు వ్యాయామం చేయరు. కానీ హీరోయిన్లు బరువు తగ్గాలనే ఉద్దేశంతో వ్యాయామం చేస్తారు. ఎక్కువ గంటల పాటు డైలీ వ్యాయామం చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. డెలివరీ అయిన 12 వారాల తర్వాత మాత్రమే చేస్తారు. ఇలా మెల్లిగా వాకింగ్, వ్యాయామం వంటివి చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఇా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే తల్లి పాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ల మార్పులు, ఫుడ్ బరువు పెరిగేలా చేస్తాయి. దీనిని తగ్గించుకోవడానికి ఫస్ట్ చేయాల్సిందంతా కూడా వ్యాయామం మాత్రమే. హీరోయిన్లు వారు తినే ఫుడ్, వ్యాయామం వల్ల డెలివరీ తర్వాత కూడా ఫిట్‌గా ఉంటారు. డెలివరీ తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువ తినకుండా చాలా లిమిట్‌లో మాత్రమే తింటారు. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకుంటారు. హెల్తీ డైట్ పాటించడం వల్ల హీరోయిన్లు డెలివరీ తర్వాత కూడా ఫిట్‌గా ఉంటారు.
డెలివరీ తర్వాతే కాకుండా సాధారణ సమయాల్లో అయినా బరువు తగ్గాలంటే తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సిందే. కొందరు ఎక్కువగా తింటారు. కానీ దానికి తగ్గట్లు వ్యాయామం చేయరు. భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. మసాలా ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్‌ను తీసుకుంటారు. వీటివల్ల డెలివరీ తర్వాత బరువు తగ్గరు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా డెలివరీ తర్వాత బరువు తగ్గాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
-
Egg Freezing: ఈ కాలం అమ్మాయిలకు ఎగ్ ఫ్రీజింగ్ ముఖ్యమా? ఏ వయస్సులో చేసుకుంటే బెటర్
-
Mango : శృంగారంపై ఆసక్తిని పెంచే ఈ పండు గురించి తెలుసా?
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు
-
Children Diabetes: పిల్లల్లో అధిక చక్కెరను గుర్తించడం ఎలా?