Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్..
Gold Rate Today ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర లక్ష దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే అమెరికా వాణిజ్య విధానాలు, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరుగుతున్నాయి.

Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లో బంగారాన్ని ఒంటిమీద నగలాగా మాత్రమే కాకుండా భవిష్యత్ పెట్టుబడిగా కూడా భావిస్తారు. అందుకే ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర లక్ష దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే అమెరికా వాణిజ్య విధానాలు, డాలర్ బలహీనత కారణంగా ధరలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,330 రూపాయల దగ్గర .. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,050 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,500 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయ చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99, 340 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,060 రూపాయల దగ్గర .. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,510 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో 100 గ్రాముల వెండ ధర 12,400 దగ్గర ట్రేడ్ అవుతుంది.