Stress : ఇది మరీ దారుణమైన ఒత్తిడి? మీకు ఇలా జరుగుతుందా? ఎలా నివారించాలి?

Stress : ప్రస్తుతం చాలా మందికి ఒత్తిడి పెరుగుతుంది. పని, డబ్బు, ఇంట్లో గొడవలు, ఆఫీస్ లో బాస్ తిట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో ఒత్తిడికి గురి అవుతున్నారు. అయితే మనిషి ఎంత ఒత్తిడిని భరించగలడు చెప్పండి. మీకు వీలైతే మీ పక్కన ఉన్నవారిని ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడం చాలా అవసరం. ఒత్తిడి లేకుండా ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. ఒక వ్యక్తి ఎంత ఒత్తిడిని మాత్రమే ఎదుర్కోగలడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇది కూడా ఒత్తిడినా?
కష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు హారర్ సినిమా చూడటం లేదా డేటింగ్‌కు వెళ్లడం వంటివి కూడా ఒత్తిడిగానే అనిపిస్తుంటాయి. ఏదైనా ప్రమాదం, లేదా అసాధారణమైనది ఏదైనా చూసినప్పుడు దాని గురించి తెలుసుకున్నప్పుడు మీ శరీరం అకస్మాత్తుగా అడ్రినలిన్ లేదా కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లతో నిండిపోతుంది. అటువంటి పరిస్థితిలో, మీ హృదయ స్పందన పెరుగుతుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది. శక్తి కూడా పెరిగినట్లు అనిపిస్తుంది. అంటే సడెన్ గా ఒత్తిడికి గురి అవుతారు. దీని ప్రభావం కొంత సమయం పాటు ఉంటుంది. ఆ తర్వాత శరీరం సాధారణ స్థితికి తిరిగి వస్తుంది.
మీరు ఒక నిర్దిష్ట పరిస్థితి లేదా పని గురించి ఒత్తిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుంది అంటున్నారు నిపుణులు. కానీ పరిస్థితి సాధారణమైతే వెంటనే మీరు బెటర్ గా ఫీల్ అవుతుంటారు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం, మన శరీరం తక్కువ మొత్తంలో ఒత్తిడిని తీసుకుంటుంది. కానీ ఈ ఒత్తిడి ఎక్కువ కాలం పాటు కొనసాగితే మాత్రం శరీరంపై అనేక చెడు పరిణామాలు కనిపిస్తాయి.
కడుపులో కూడా సమస్య: చాలా మంది కడుపులో కూడా ఏదో తిరిగినట్టు, ఏదో అవుతున్నట్టు ఫీల్ అవుతారు. ఎవరితో అయినా సడన్ గా మాట్లాడే అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ప్రదర్శన చేయాల్సి వచ్చినప్పుడు, సభల్లో మాట్లాడే ముందు కడుపులో ఒక రకమైన ఫీల్ ను అనుభవిస్తుంటారు కొందరు. ఇది కూడా ఒత్తిడే. కానీ అప్పుడు మీరు కూల్ అవ్వాలి అని గుర్తు పెట్టుకోండి. దీనికి మించిన ఒత్తిడి తీసుకోవద్దు.
పదే పదే జరిగితే: తీవ్రమైన ఒత్తిడి పదే పదే కొనసాగితే, అది గుండె ధమనులలో వాపుకు కూడా దారితీస్తుంది. గుండెపోటు రావడానికి గల అనేక కారణాలలో ఇది కూడా ఒకటి. అదే సమయంలో, ఒక వ్యక్తి ఒత్తిడితో పోరాడే విధానం కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది అంటున్నారు నిపుణులు.
దీన్ని ఎలా నిర్వహించాలి
స్నేహితులను చేసుకోండి. వారికి కనెక్ట్ అయి ఉండండి. వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. ప్రతి రాత్రి బాగా నిద్రపోండి. మీరు నిరంతరం ఒత్తిడికి గురవుతుంటే, మనస్తత్వవేత్తను కలవండి. కౌన్సిలింగ్ తీసుకొండి. బయటకు వెళ్లండి. సినిమా, పార్క్ వంటి వాటికి వెళ్లండి. మీ మనసు రిలాక్స్ అవడానికి మీకు ఎలాంటి అలవాట్లు ఉపయోగపడతాయో ఆళోచించి వాటితోనే సమయం కేటాయించండి.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే