Summer: చల్లదనం కోసం వేసవిలో ఇవి తిన్నారో.. ఇక అంతే సంగతులు

Summer:
శీతాకాలం పోయి వేసవి కాలం వచ్చేస్తుంది. ఇప్పటికే ఎండలు భగ భగ మండిపోతున్నాయి. ఇంట్లో ఫ్యాన్‌లు తిరుగుతున్నా కూడా ఉక్కపోస్తోంది. దీంతో చాలా మంది చల్లని పదార్థాల వైపు మళ్లుతున్నారు. వేసవిలో వేడిని తట్టుకోలేక చాలా మంది ఎక్కవగా వేడి పదార్థాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. వాటర్ నుంచి డ్రింక్‌ల వరకు అన్ని కూడా చల్లగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఐస్ క్రీమ్‌లు, చల్లని జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్, కోల్డ్ కాఫీ ఇలా అన్ని కూడా చల్లని పదార్థాలను తీసుకుంటారు. వీటివల్ల ఆ నిమిషానికి ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఆ తర్వాత అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బాగా చల్లని పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చల్లదనం కోసం వేసవిలో ఎక్కువగా కోల్డ్ కాఫీ, ఐస్ క్రీమ్, శీతల పానీయాలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
జీర్ణ సమస్యలు
ఉక్కపోతను తట్టుకోలేక చల్లదనం కోసం చాలా మంది ఐస్ క్రీమ్‌లు, డ్రింక్‌లు తీసుకుంటారు. సాధారణంగా చల్లగా ఉంటే పర్లేదు. కానీ బాగా చల్లగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాఫీ ప్రియులు అయితే వేడి కంటే చల్లని కాఫీ ఈ వేసవిలో తాగుతుంటారు. మరీ ఎక్కువగా బాడీలోకి చల్లని పదార్థాలు వెళ్తే తొందరగా జీర్ణం కావు. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వేసవిలో ఎక్కువగా చల్లని పదార్థాలు తీసుకోవద్దు.
శరీర ఉష్ణోగ్రతలో మార్పులు
బయట ఎండ నుంచి వచ్చిన తర్వాత చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల కాస్త ఉపశమన లభిస్తుందని అనుకుంటారు. బాడీలో ఉన్న వేడి అంతా కూడా చల్లని పదార్థంతో తగ్గుతుందని భావిస్తారు. కానీ చల్లని పదార్థాల వల్ల శరీర ఉష్ణోగ్రత మారుతుంది. బాగా చల్లగా ఉన్న ఫ్రిడ్జ్ వాటర్, శీతల పానీయాలు బాడీని వేడిగా చేస్తాయి. దీంతో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఇది మలబద్ధకం, పేగు సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఉబ్బరం, త్రేనుపులు, గ్యాస్ నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
గొంతు సమస్యలు
చల్లని పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే గొంతు సమస్యలు వస్తాయి. గొంతు దగ్గర చికాకు, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. వేసవిలో ఎక్కువగా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతుంటారు. దీనివల్ల జలుబు, దగ్గు, గొంతు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని వేసవిలో ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వేసవిలో బాగా చల్లగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. బాగా చల్లగా ఉన్నవి తింటే మీకు ఫుడ్ టేస్ట్ కూడా సరిగ్గా తెలియదు. కొన్ని పదార్థాలను తిన్న కూడా ఆ ఫీలింగ్ తెలియదు. కాబట్టి నార్మల్ చల్లగా ఉండేలా పదార్థాలను తీసుకోండి.
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Summer Health Tips: వేసవిలో వీటిని తీసుకోండి శరీరం చల్లగా ఉంటుంది.
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Summer: వేసవిలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోండిలా!
-
Summer : సమ్మర్ లో ప్రయాణమా? ఇవి మస్ట్..
-
Summer Health Tips: ఎండాకాలం మొదలైంది. ఉప్పు నీరు తాగుతున్నారా?