Tattoos : హెచ్చరిక: మీరు టాటూలు వేయించుకున్నారా? వేయించుకోవాలి అనుకుంటున్నారా?

Tattoos :
చాలా మందికి టాటూలు వేయించుకోవడం చాలా ఇష్టం. చేతులు, కాళ్ల మీదనే కాదు గుండె మీద కూడా టాటూలు వేయించుకుంటున్నారు. కనిపించని ప్రాంతంలో కూడా టాటూలు వేయించుకోవడం ప్రస్తుతం ఫ్యాషన్ గా మారింది. అయితే దీని వల్ల కొన్ని ప్రమాదాలు కూడా వస్తాయి అంటున్నారు నిపుణులు. అసలు టాటూ వేయించుకునే ముందు దీని వల్ల వచ్చే సమస్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కొత్తగా వేయించుకునే వారు ఇది చదివిన తర్వాత టాటూ గురించి ఆలోచించండి. వేసుకున్న వారు తెలుసుకోండి డియర్స్. మరి ఆలస్యం చేయకుండా విషయంలోకి ఎంటర్ అవుదాం.
శరీరంపై టాటూలు వేయించుకున్న వ్యక్తుల గురించి ఒక పరిశోధనలో తేలింది. టాటూలు లేని వారి కంటే ఉన్న వారికి చర్మ, లింఫోమా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సదరన్ డెన్మార్క్ విశ్వవిద్యాలయం (SDU)లోని పబ్లిక్ హెల్త్ విభాగం, క్లినికల్ రీసెర్చ్ విభాగం పరిశోధకులు హెల్సింకి విశ్వవిద్యాలయంతో కలిసి టాటూ సిరా వల్ల కలిగే ఆరోగ్య పరిణామాలను విశ్లేషించారు.
‘యూనివర్శిటీ ఆఫ్ సదరన్ డెన్మార్క్’ (SDU) ప్రకారం, టాటూ సిరాలో చాలా ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయట. ఇది చర్మం లోపలకి వెళ్తే చాలా ప్రమాదకరంగా మారుతుందని రుజువు అయింది. దీని కారణంగా శోషరస కణుపుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మన రోగనిరోధక శక్తికి శోషరస గ్రంథులు చాలా ముఖ్యమైనవి. దీని కారణంగా, అసాధారణ కణాల పెరుగుదల కూడా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అయితే అనలిటికల్ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, టాటూ సిరాలో చర్మం, ఊపిరితిత్తులు, కాలేయంలో చికాకు కలిగించే అనేక ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.
అంతేకాదు ఇది మూత్రపిండాలు, నాడీ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాటూ వేయించుకోవడానికి ఉపయోగించే సూది సరైనది కాదు. కొన్ని సార్లు అందరికీ ఒకే సూది ఉపయోగిస్తారు. దీని వల్ల ఒకరి నుంచి మరొకరికి చాలా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. రక్తం ద్వారా అనేక ప్రమాదకరమైన వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.
వ్యాధుల సమస్య..
హెపటైటిస్ సి, హెచ్ఐవి లేదా ఎయిడ్స్, మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి చాలా తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. స్వీడన్‌లోని లిండ్ యూనివర్సిటీ పరిశోధకులు టాటూల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. స్వీడిష్ నేషనల్ క్యాన్సర్ రిజిస్టర్‌ను 2007 నుంచి 2017 వరకు 10 సంవత్సరాలు విశ్లేషించారు. ఇందులో 20 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ అధ్యయనంలో టాటూలు వేయించుకున్న వారికి టాటూలు లేని వారి కంటే లింఫోమా వచ్చే ప్రమాదం 21 శాతం ఎక్కువగా ఉందని తేలింది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Skin Care Tips: వేసవిలో చర్మం దెబ్బతింటుందా? ఇలా చేయండి
-
Beauty Tips : కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? రైస్ వాటర్ టోనర్ ఇలా తయారు చేసి, అప్లే చేసుకోండి.
-
Skin Care: ఈ కేర్ లేకపోతే మీ స్కిన్ త్వరగా పాడవడం గ్యారంటీ.. కేర్ మస్ట్ బ్యూటీ నెక్ట్స్
-
Skin Care: తేనె, పచ్చిపాలు, పసుపు చాలు మీ స్కిన్ మెరిసిపోతుంది. ఇంతకీ ఎలా ఉపయోగించాలంటే?