Skin Care: ఉదయం లేచిన వెంటనే ముఖానికి వీటిని అప్లై చేస్తే.. మెరిసిపోవడం ఖాయం

Skin Care: సీజన్‌తో సంబంధం లేకుండా కొందరి ముఖం డల్‌గా ఉంటుంది. ఏ సీజన్‌లో అయినా కూడా ఏదో కోల్పోయినట్లు ఉంటారు. ఫేస్ డల్‌గా ఉండకుండా రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే మాత్రం కొన్ని టిప్స్‌ను తప్పకుండా పాటించాలి. మార్కెట్‌లో లభ్యమయ్యే ఫేస్ సీరమ్‌లు మాత్రమే కాకుండా కొన్ని పదార్థాలను ముఖానికి అప్లై చేయడం వల్ల తెల్లగా మెరిసిపోతారు. ముఖంపై ఉండే ట్యాన్ అంతా కూడా పోతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి క్రీములు రాయడం వల్ల ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అదే ముఖానికి సహజంగా ఉండే వాటిని రాస్తే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. యంగ్ లుక్‌లో మెరిసిపోతారు. అయితే ఉదయం లేచిన వెంటనే ముఖానికి రాయాల్సినవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
దోసకాయ
ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మాన్ని మెరిపించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీంతో ముఖంపై ఉండే ట్యాన్ అంతా కూడా పోతుంది. ఉదయం లేచిన వెంటనే దోసకాయను ముఖానికి అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. అలాగే ముఖంపై ముడతల లేకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారని నిపుణులు అంటున్నారు. దోసకాయను తినడం వల్ల కూడా చర్మం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దోసకాయ పేస్ట్‌ను ముఖానికి రాసి ఒక పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.
బంగాళదుంప
బంగాళదుంప తురుము నుంచి రసం తీయాలి. దీన్ని ముఖానికి అప్లై చేస్తే నల్లటి మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. బంగాళదుంపల్లో బ్లీచింగ్ ఏజెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్నింటిని కూడా పూర్తిగా తొలగించి మెరిసేలా చేస్తాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల యంగ్ లుక్‌లో కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.
టమోటా
ఇందులో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. అయితే టమోటాపై పంచదార వేసి ముఖానికి అప్లై చేస్తే.. మొటిమలు లేకుండా మెరిసిపోతారు. ఇందులోని లైకోపీన్ చర్మంపై ట్యాన్‌ను తొలగిస్తుంది. చర్మ మెరిసేలా చేస్తుంది.
క్యారెట్
ఇందులో విటమిన్ ఈ, ఏ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ క్యారెట్ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల మెరిసిపోతుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమలు అన్నింటిని కూడా తొలగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఉదయం పూట క్యారెట్ జ్యూస్ తాగడం లేదా వీటి పేస్ట్‌ను ముఖానికి రాయడం వల్ల అందంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ పేస్ట్‌లో పసుపు, తేనె కూడా కలపవచ్చు. ఇలా తయారు చేసిన ప్యాక్‌ను ముఖానికి పట్టించి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగితే మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. జైషే చీఫ్ మసూద్ అజార్ ఎవరు?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్‌కి ఆటంకమా!
-
Operation Sindoor: పాక్‌లో మొదలైన యుద్ధ భయం.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్టేనా?