Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వంటింట్లోని ఈ తెల్ల ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే.

Heart Health: ప్రస్తుతం గుండెజబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక బిజీ, చెడు ఆహారపు అలవాట్లు ఈ సమస్యను మరింత పెద్దగా చేస్తున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉంటే ఎన్నో విధులు సక్రమంగా జరుగుతాయి. కాస్త సమస్యల్లో చుట్టుముట్టినా సరే బాడీ సహకరించదు. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం కొన్ని హార్ట్ కు సంబంధించిన టిప్స్ చూసేద్దాం. అవి మిమ్మల్ని గుండె సమస్యల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఒత్తిడి: మద్యం కంటే ప్రమాదమట ఒత్తిడి. లిమిట్ గా మద్యం సేవించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు అంటున్నారు వైద్యులు. అందుకే సంతోషంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత, ఆనందం మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. మీకు దీర్ఘాయువును ప్రసాదిస్తాయి అంటున్నారు నిపుణులు.
వ్యాయామం మస్ట్: శరీరం సక్రమంగా పని చేయాలంటే వ్యాయామం కచ్చితంగా చేయాలి. వ్యాయామం వల్ల శరీరం సూపర్ ఫాస్ట్ అవుతుంది. గుండె సమస్యలతో బాధ పడే వారికి నడక మరీ మస్ట్. అందుకే వారానికి 4-5 రోజులు క్రమం తప్పకుండా వ్యాయామా చేయాలని చెబుతుంటారు నిపుణులు. దీని వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక వ్యాయామం చేస్తూనే మీ శరీర బరువు మీద కూడా ఫోకస్ చేయాలి.
తెల్లటి పదార్థాలు: మీరు తినే ఆహారంలో కొన్ని తెల్ల ఆహారాలను స్కిప్ చేయాలి అంటున్నారు వైద్యులు. తెల్లటి ఆహారాలా అని థింక్ చేస్తున్నారా? అవేంటంటే? ముందుగా చక్కెర, అధిక ఉప్పు, తెల్ల బియ్యం, పిండి వంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి. వీటిని లిమిట్ గా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. జాగ్రత్త.
టీ స్పూన్ చక్కెర: ప్రతి రోజు మీరు కేవలం ఒక టీ స్పూన్ షుగర్ ను మాత్రమే తీసుకోవాలట. లేదంటే అధిక బరువు పెరుగుతారు. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. గ్లైసమిక్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచి గుండె సమస్యలను సృష్టిస్తాయి.
తీపి పదార్థాలు: ఇవి కూడా గుండెకు సమస్యలను సృష్టిస్తాయి. ఇలాంటి వస్తువులకు కూడా దూరంగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మంచి జీవనశైలిని కొనసాగిస్తే మీ గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆల్ ది బెస్ట్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Heart Attacks: భారతీయుల్లోనే గుండె పోటు ఎక్కువ.. దీనికి కారణమేంటి?
-
Coconut water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు అధికంగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Maha Shivaratri: శివుడికి ఇష్టమైన ఆకులు ఇవే.. వీటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు
-
Heart Attack: మీకు గుండె పోటు వచ్చే నెల రోజుల ముందు నుంచే ఈ 8 సంకేతాలు ఉంటాయి.. అవేంటంటే?
-
Weight Loss: ఈ మసాలా దినుసులతో ఈజీగా వెయిట్ లాస్.. డైలీ తీసుకుంటే సన్నని నడుము మీ సొంతం