Weight Loss : పొట్ట ముందుకు వేలాడుతుందా? జస్ట్ ఇలా చేయండి నాజూగ్గా అవుతారు..

Weight Loss :
అధిక బరువు అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది కదా. మీ చుట్టూ అధిక బరువుతో ఉన్న వాళ్లు ఎంతో మంది ఉంటారు. మేబీ ఈ వార్త చదివే వారు కూడా ఆ సమస్యతో బాధపడుతున్నారు కావచ్చు. కానీ వాస్తవానికి మీ బాధ వర్ణించడం కష్టమే. కొందరు సమయం లేక, కొందరు బయటకు వెళ్లలేక వ్యాయామం చేయలేరు. డైట్ ను పాటించలేరు. ఆహార నియమాలు తెలియదు. సో ఎలా ఎలా ఎలా? సన్నగా అవ్వాలి అని చాలా థింక్ చేస్తారు. కానీ మంచి సొల్యూషన్ దొరకడం లేదా? కొందరు హెవీ వర్కౌట్స్ చేస్తారు. కానీ దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇక కొందరు ఆహారం మానేస్తారు కానీ దీని వల్ల అనారోగ్యంతో పాటు బరువు తగ్గడం వీలు కాదు. అయితే ఆరోగ్యంగా బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆకుకూరలు
పాలకూర, కాలే, మెంతులు, ఆవాలు, లెట్యూస్ వంటి ఆకుకూరలు బరువు తగ్గిస్తాయి. ఎందుకంటే వాటిలో కేలరీలు చాలా తక్కువ. అయితే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. సో మీకు పదే పదే ఆకలి కాదు. అదనపు కేలరీలు తీసుకోకుండా ఉంచుతుంది. మీరు ఈ కూరగాయలను సలాడ్, సూప్ లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి. ప్రోటీన్ మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది . గుడ్లలో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా మీరు ఎక్కువ ఆహారాన్ని తీసుకోరు. గుడ్లను ఉడికించి, ఆమ్లెట్లు లేదా శాండ్‌విచ్‌ల రూపంలో తినవచ్చు. అయితే, గుడ్లను పరిమిత పరిమాణంలో తినాలని గుర్తుంచుకోండి.
ఓట్స్
బరువు తగ్గడానికి సహాయపడే గొప్ప అల్పాహారం ఓట్స్. ఇందులో బీటా-గ్లూకాన్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనితో పాటు ఓట్స్ కేలరీలు తక్కువగా ఉంటాయి. శక్తి వస్తుంది. మీరు ఓట్స్‌ను పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. లేదా పండ్లు, గింజలతో తినవచ్చు. ఇది రుచికరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
పప్పుధాన్యాలు – చిక్కుళ్ళు: శనగ, రాజ్మా, పప్పు, పెసలు, మినప్పప్పు వంటి పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు ప్రోటీన్, ఫైబర్ కు మంచి మూలం. ఈ ఆహారాలు మీ ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీ ఆహారంలో పప్పుధాన్యాలను చేర్చుకోవడం ద్వారా, మీ జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. వీటిని కూరగాయలు, సూప్ లేదా సలాడ్ గా తినవచ్చు.
గింజలు – విత్తనాలు: బాదం, వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు వంటి గింజలు, విత్తనాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆకలిని నియంత్రిస్తాయి. మీరు అదనంగా తినలేరు కూడా. అయితే, గింజల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. కాస్తనే తీసుకోవాలి. ఓ గుప్పెడు సరిపోతాయి లెండి..
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Weight Loss: ఒక నెలలో ఎంత బరువు తగ్గాలి? ఏది మంచిది?
-
Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..
-
Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?
-
Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్
-
Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు