Weight Loss Tips: మెట్లు ఎక్కడం vs వేగంగా నడవడం? బరువు తగ్గడానికి ఏది బెస్ట్ ఆప్షన్?

Weight Loss Tips: ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. ఇక బరువు ఉన్న వారు అయితే కాస్త ఎక్కువగానే కష్టపడుతుంటారు. ఆహారం విషయంలో అయితే పాపం కడుపుకు ఉపవాసమే. కొలెస్ట్రాల్ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉంటారు. మరి బరువు ఎన్నో సమస్యలకు మూలం అవుతుంది. అందుకే బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒకసారి బరువు పెరిగిన తర్వాత తగ్గడం చాలా కష్టం. కానీ సరైన ఆహారం, వ్యాయామం చేస్తే మీరు కోరుకున్న ఫిట్‌నెస్‌ను సాధించవచ్చు.
బరువు తగ్గాలంటే రోజూ నడవాలని సలహా ఇస్తారు నిపుణులు. కానీ మెట్లు ఎక్కడం వల్ల కేలరీలు ఖర్చవుతాయి అని చెప్పే వారు కూడా లేకపోలేదు. మరి అలాంటి పరిస్థితిలో, బరువు తగ్గడానికి నడవడమా లేదా మెట్లు ఎక్కడమా అనే అనుమానం మీకు కలిగిందా? అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు ఓ క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేసేద్దామా?
మెట్లు ఎక్కుతున్నారా?: నడకతో పోలిస్తే, మెట్లు ఎక్కడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మెట్లు ఎక్కేటప్పుడు, శరీరం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పని చేయవలసి ఉంటుంది. దీనికి ఎక్కువ శ్రమ అవసరం. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఈ ప్రక్రియలో, కండరాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. కేలరీలు వేగంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు, 15 నిమిషాలు మెట్లు ఎక్కితే 45 నిమిషాలు వేగంగా నడిచిన దానితో సమానమట.
1. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి: మీరు నడుస్తున్నప్పుడు, శరీరం అడ్డంగా కదులుతుంది. అయితే మెట్లు ఎక్కేటప్పుడు శరీరం నిలువుగా కదులుతుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయడానికి ఎక్కువ శ్రమ ఉంటుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.
2. ఎక్కువ కండరాలు శ్రమ: మెట్లు ఎక్కేటప్పుడు, కాళ్ళు మాత్రమే కాకుండా మొత్తం శరీరంలోని కండరాలు పని చేస్తాయి. మీ దిగువ శరీర కండరాలను బలోపేతం చేయాలనుకుంటే, మెట్లు ఎక్కడం ఒక అద్భుతమైన వ్యాయామం అంటున్నారు నిపుణులు.
3. ఇంట్లోనే: మీరు నడిచినా లేదా పరిగెత్తినా, ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. లేదా ట్రెడ్‌మిల్ ఉపయోగించండి. కానీ అది ఇల్లు అయినా, ఆఫీసు అయినా, ఫ్లాట్ అయినా, మీరు లిఫ్ట్ వాడటం మానేసి, మెట్లను మాత్రమే ఉపయోగించడం ప్రారంభిస్తే, మీ వ్యాయామం అక్కడే పూర్తిగా అవుతుంది. సో నో లిఫ్ట్ మెట్లు బెస్ట్.
4. ఇంటర్వెల్ శిక్షణ: ఈ రోజుల్లో ఫిట్‌నెస్ ప్రపంచంలో ఇంటర్వెల్ శిక్షణ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ఇవ్వడంలో సహాయపడుతుంది. మెట్లు ఎక్కడం ఇప్పటికే మంచి శిక్షణగా పనిచేస్తుంది. పైకి ఎక్కేటప్పుడు, హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కండరాలు చురుగ్గా మారుతాయి. దిగుతున్నప్పుడు, శరీరం కోలుకోవడానికి సమయం లభిస్తుంది.
మీ కీళ్లపై తక్కువ ఒత్తిడిని ఎలా ఉంచాలి
మెట్లు ఎక్కడం అనేది పరుగెత్తడం కంటే తక్కువ ప్రభావం చూపే వ్యాయామం, కానీ అది మీ కీళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది అని మాత్రం మర్చిపోవద్దు. కొందరికీ మోకాళ్ళు కూడా అరిగే అవకాశం ఉంటుంది. సరైన పద్ధతులను అవలంబించడం ద్వారా ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చు. సరైన బూట్లు ధరించడం వల్ల కీళ్ల సమస్య కాస్త బెటర్ అవుతుంది. అలాగే, మొదటి 10 నిమిషాలు నెమ్మదిగా ఎక్కి దిగండి, తర్వాత వేగాన్ని పెంచడం అలవాటు చేసుకోవాలి. డైరెక్ట్ గా వేగం పెంచకూడదు. మీ పాదాలను నేలపై బలంగా ఆనించడం వల్ల మీ మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. సో మోకాళ్ల సమస్య పెరుగుతుంది. జాగ్రత్త.
ఈ పరిస్థితుల్లో మెట్లు ఎక్కడం మానుకోవాల్సిందే.
మీకు 70 ఏళ్లు నిండినా లేదా మోకాలి నొప్పి ఉన్నా సరే మెట్లు ఎక్కకూడదు.
మీరు గర్భవతిగా ఉండి, ప్రసవం దగ్గర పడితే ఈ వ్యాయామాన్ని స్కిప్ చేయాలి.
రీసెంట్ గా యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లయితే లేదా గుండె జబ్బులు సమస్యలు ఉన్నా సరే స్కిప్ చేసేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Weight Loss: ఒక నెలలో ఎంత బరువు తగ్గాలి? ఏది మంచిది?
-
Weight loss : ఎంత ప్రయత్నించినా సరే బరువు తగ్గడం లేదా? జస్ట్ ఈ టీలు చాలు..
-
Curd Rice: పెరుగన్నంలో ఈ పండు కలిపి తింటే?
-
Weight Loss: ఈ కాఫీతో ఈజీగా వెయిట్ లాస్
-
Weight loss: ఈజీగా బరువు తగ్గాలా.. అయితే జిమ్ అవసరం లేదు.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు